Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla: ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Garla: ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

రెయిన్ బో నిర్మలా హై స్కూల్లో..

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని నిర్మల హై స్కూల్ ప్రిన్సిపాల్ జైస్ అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక నిర్మలా హై స్కూల్ పాఠశాలలో మంగళవారం రెయిన్ బో నిర్మలా హై స్కూల్ ఆర్ట్స్ ఫెస్టా 2023 24 సంవత్సరానికి గాను ప్రిన్సిపాల్ జైస్ ఆధ్వర్యంలో క్లాసికల్ డ్యాన్స్ లతో పాటుగా విచిత్ర వేషధారణ వ్యాసరచన యోగ ఆటల పోటీలు నిర్వహించారు. తొలుత ప్రిన్సిపాల్ జైస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వేషధారణలు కళారూపాలు అలరించాయి. విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జైస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత భావాలు పెంపొందించాలని సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం దిశగా కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సిస్టర్ శలెట్ సినీ జర్లిన్ రోస్మిన్ జెన్నీ నాగమల ప్రవీణ్ రవి బాలస్వామి శేఖర్ సురేందర్ పవన్ శివ కృష్ణ నరేష్ శ్రీనివాస్ శిరోమణి వాణి సాహితీ సరిత రమణ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News