Thursday, September 19, 2024
Homeనేషనల్కవలలకు జన్మనిచ్చిన ఈశా అంబానీ.. ఏం పేర్లు పెట్టారో తెలుసా

కవలలకు జన్మనిచ్చిన ఈశా అంబానీ.. ఏం పేర్లు పెట్టారో తెలుసా

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ మరోసారి తాతయ్యారు. ఆయన కూతురు ఈశా అంబానీ కవలలకు జన్మనిచ్చింది. ఈ మేరకు అంబానీ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈశా అంబానీ – ఆనంద్ పిరమాల్ దంపతులకు కవలలు జన్మనిచ్చినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. మా పాప ఈశా అంబానీ నవంబర్ 19న కవలలకు జన్మనిచ్చింది. పాపకు అదియా, బాబుకి కృష్ణ అని పేర్లు పెట్టారు.

- Advertisement -

ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఆ దంపతులకు, పిల్లలకు మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నామని అంబానీ కుటుంబం పేర్కొంది. కాగా.. ఈశా-ఆనంద్ లు చిన్ననాటి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పంచి 2018 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈశా రిలయన్స్ రిటైల్ వ్యాపారాలను చూసుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News