ధాన్యాన్ని తరలించే అవకాశం ఉంటె వెంటనే మిల్లులకు చేర్చాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ రైతులకు సూచించారు. పెదపాడు మండలం సీతారామపురం, వట్లూరు గ్రామాలలో భారీ వర్షాలకు మునిగిన పంట పొలాలను జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణితో కలిసి మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంత రైతులతో కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా కలిగించారు. కళ్ళాలలో ఉన్న దాన్యాన్ని ఆర్బీకే ల ద్వారా ఆఫ్ లైన్ పద్దతిలో మిల్లులకు తరలించుకునేందుకు ప్రభుత్వం కల్పించిందన్నారు.
ఖరీఫ్ ధాన్యంను పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. సీతారామపురం రైతులు కళ్ళాలలో భద్రపరచిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ప్రస్తుతం పంట పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పంట నష్టానికి పరిహారం అందేలా చూడాలని, సబ్సిడీపై విత్తనాలు సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. అనంతరం వట్లూరులో నేలకొరిగిన వారి పంటను పరిశీలించారు. అక్కడ పంట పరిస్థితిని వ్యవసాయ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఎటువంటి సమయంలో రైస్ మిల్లర్లు రైతులకు అండగా నిలవాలన్నారు. కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ ఎన్ .ఎస్. కె. ఖాజావలి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజుభార్గవి, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ళ సతీష్ చౌదరి, తహసిల్దార్ విజయ్ కుమార్, వ్యవసాయశాఖ ఏడి వై. సుబ్బారావు, వ్యవసాయశాఖాధికారి వి. ప్రవీణ్ కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.