Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభBirthday: లెజెండరీ సింగర్ బర్త్ డే, మళ్లీ మిస్ అయిన మూకాంబిక ఈవెంట్

Birthday: లెజెండరీ సింగర్ బర్త్ డే, మళ్లీ మిస్ అయిన మూకాంబిక ఈవెంట్

కేజే ఏసుదాస్ ఈరోజు 83వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన పుట్టినరోజునాడు కర్నాటకలోని కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవటం ఆయనకు దశాబ్దాలుగా వస్తున్న సెంటిమెంట్. గత నాలుగు దశాబ్దాలుగా తన కుటుంబంతో కలిసి మూకాంబికను దర్శనం చేసుకుని అక్కడ సంగీత కచేరీ చేయటం ఆయనకు అత్యంత ఇష్టమైన బర్త్ డే సెలబ్రేషన్. కానీ గత మూడేళ్లుగా అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్న ఏసుదాస్ ఈ ఏడాది కూడా కొల్లూర్ ఈవెంట్ వరుసగా మూడవ ఏడాది మిస్ అయ్యారు. కానీ సూపర్ స్టార్ మమ్ముట్టి సహా ఎంతోమంది ప్రముఖులు డల్లాస్ కు వచ్చి ఆయన పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు.

- Advertisement -

గత 6 దశాబ్దాలుగా పాటలు పాడుతున్న ఏసుదాస్..80,000కు పైగా పాటలు వివిధ భారతీయ భాషల్లోనే కాదు అరిబిక్,లాటిన్, రష్యన్ భాషల్లోనూ పాడారు. 8 జాతీయ అవార్డులతో పాటు 25 రాష్ట్ర అవార్డులను అందుకున్న మహా గాయకుడిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ తో సత్కరించింది. ఎప్పుడూ వైట్ కుర్తా, వైట్ ధోతీతో కనిపించే ఏసుదాస్ గొంతులో అయ్యప్ప గీతాలు వంటివి భక్తి రసాన్ని ఒలకబోస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News