ఫోర్బ్స్ మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ లిస్టులో నిర్మలా సీతారామన్ తో పాటు మరో ముగ్గురు ఇండియన్ మహిళలున్నారు. రోష్ని నాడార్ మల్హోత్రా, సోమా మండల్, కిరణ్ మజుందార్ షాలు ఫోర్బ్స్ లిస్ట్ లో ఉన్నారు. ఫోర్బ్స్ లిస్టులో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 32వ ర్యాంక్ లో నిలిచారు. గత కొన్నేళ్లుగా నిర్మలా ఈ జాబితాలో వరుసగా చోటు దక్కించుకుంటున్నారు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, మ్యుజీషియన్ టేలర్ స్విఫ్ట్ వంటివారు పవర్ఫుల్ వుమెన్ గా నిలిచారు.
ఈ లిస్ట్ లో టాప్ వన్ పొజిషన్ లో మాత్రం యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్డర్ నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాస్ క్రిస్టిన్ లెగార్డ్ సెకెండ్ పొజిషన్ లో ఉన్నారు. కమలా హ్యారిస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు.
హెచ్సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ ప్రస్తుతం సంస్థ చైర్పర్సన్ గా ఉన్నారు. స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏఐఎల్) తొలి మహిళా చైర్పర్సన్ అయిన సోమా మండల్ సంస్థను సెయిల్ లాభాలను మూడరెట్లు వృద్ధి చేశారు.