మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు., యశోద డాక్టర్లను కలిసి, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎంవీ రావు తదితరులున్నారు. సీఎం వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ తదితరులున్నారు.