Saturday, October 5, 2024
HomeతెలంగాణLB Nagar: సుధీర్ రెడ్డికి ఘన సన్మానం

LB Nagar: సుధీర్ రెడ్డికి ఘన సన్మానం

మరింత అభివృద్ధి చేస్తానంటూ హామీలు

ఎల్బి నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి అఖండ విజయం సాధించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని హయత్ నగర్ డివిజన్ పరిధిలోని పార్టీ నాయకులు, మిథాని కాలనీ వాసులు, పలువురు ముస్లిం పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..ఎల్బి.నగర్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం సుధీర్ రెడ్డితో సాధ్యం అని తెలిపారు. వారు చేసిన అబివృద్దే వారి విజయానికి కారణం అని తెలిపారు.

- Advertisement -

అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇట్టి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, గుడాల మల్లేష్, చెన్నగొని మదన్ గౌడ్, గజ్జి అశోక్, గణేష్, కృష్ణ, జంగయ్య, భాస్కర్ గుప్తా, యాదగిరి, లింగం శ్రీను, చంద్రశేఖర్ రెడ్డి, అంజయ్య గౌడ్, సలీం, ఛాన్ పాషా, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News