Sunday, October 6, 2024
HomeతెలంగాణMana Bashti-Mana Badi: మారనున్న సర్కారీ బడుల రూపురేఖలు

Mana Bashti-Mana Badi: మారనున్న సర్కారీ బడుల రూపురేఖలు

ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ జిల్లాలో మన బస్తీ మన బడి కార్యక్రమం క్రింద జరుగుతున్న అభివృద్ధి పనులపై బుధవారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

పాఠశాలల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలనే ఆలోచనతోనే కాచిగూడ పాఠశాలలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. మన బస్తి మన బడి కార్యక్రమం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,065 పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం 7,289 కోట్ల రూపాయలను కేటాయించారని తెలిపారు. ఇందులో మొదటి విడతలో 9,123 పాఠశాలల్లో పూర్తిస్థాయి అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎంపిక చేసి 3,497.62 కోట్ల రూపాయలను విడుదల చేశారని తెలిపారు.

హైదరాబాద్ జిల్లాలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేసినట్లు వివరించారు. ఆయా పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణం, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించడం, సరిపడా ఫర్నిచర్ ను సమకూర్చడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం వంటి పనులను మన బస్తి మన బడి కార్యక్రమం క్రింద చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. కొన్ని పాఠశాలల్లో కూలిపోయే దశలో చెట్లు ఉన్నాయని, అలాంటి వాటిని గుర్తించి తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వం చేపట్టిన మన బస్తి మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని, రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరగనున్నదని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News