- సాధారణంగా యుద్ధట్యాంకులు అంటే 60 నుంచి 70 టన్నుల వరకు బరువు ఉంటాయి. హిమాలయాల్లాంటి ఎత్తయిన ప్రాంతాలకు వాటిని తీసుకెళ్లడం, అక్కడ మోహరించడం దాదాపు అసాధ్యం. లద్దాఖ్ సరిహద్దుల్లో పొంచి ఉన్న చైనా దగ్గర ఇప్పటికే తేలికపాటి ట్యాంకులు ఉన్నాయి. వాటిని విమానాల్లోను, అవసరమైతే ప్యారాచూట్ల ద్వారా కూడా దించేందుకు అవకాశం ఉంది. వాటిని టైప్-15 ట్యాంకులు అంటారు. పక్కలో బల్లెంలా పొంచి ఉన్న చైనాను ఢీకొట్టాలంటే మన దగ్గర కూడా అలాంటివి ఉండాలి. అందుకే మనదైన తేలికపాటి ట్యాంక్ జొరావర్ ను సిద్ధం చేయడానికి డీఆర్‌డీఓ, ఎల్ అండ్ టీ కలిసి నడుం కట్టాయి. కేవలం 25 టన్నుల బరువు మాత్రమే ఉండి, సులభంగా విమానాల్లో తీసుకెళ్లి మోహరించేలా వీటిని సిద్ధం చేస్తున్నారు. ఎత్తయిన పర్వతప్రాంతాలకు వీటిని తీసుకెళ్లడం, అక్కడ వీటితో ఫైరింగ్ చేయించడం లాంటి ప్రయోగాలు ఈ నెలలోనే ప్రారంభమవుతున్నాయి.
War tanks in flights: విమానంలో యుద్ధట్యాంకు
చైనాకు దీటుగా సిద్ధం చేస్తున్న డీఆర్‌డీఓ, ఎల్ అండ్ టీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES