Saturday, April 12, 2025
HomeదైవంMahanandi: మహానందిలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు

Mahanandi: మహానందిలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు

మహా పూర్ణాహుతితో ముగింపు

మహానంది క్షేత్రంలో కార్తీకమాసం అమావాస్య సందర్భంగా శ్రీ కామేశ్వరి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ వారి బృందం వేదమంత్రాలతో శ్రీ కామేశ్వరి అమ్మవారికి లోక సౌభాగ్యం కోసం, విశేష ద్రవ్య అభిషేకార్చనలు, ప్రత్యేక అలంకారాలు చేసి ఉభయ దాతలు గడ్డం రామకృష్ణారెడ్డి విజయకుమారి దంపతులు వారి కుటుంబ సభ్యులు, ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డిలచే శంఖాభిషేకం, లక్ష కుంకుమార్చన, చండీహోమం, మూల మంత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలయ ధర్మకర్తలు బండి హేమలత, బసిరెడ్డి రామతులసమ్మ, గంగిశెట్టి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మహా పూర్ణాహుతితో ముగిసిన కార్తీకమాసోత్సవాలు..
మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు మహా పూర్ణాహుతితో ముగిశాయి. యాగశాలలో వేద పండితులు ఈవో, ఉభయ దాతలచే మహా పూర్ణాహుతి పూజలు నిర్వహింపజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News