Friday, November 22, 2024
HomeతెలంగాణGarla: పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేయాలి

Garla: పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేయాలి

ఎమ్మెల్యే కోరం కనకయ్య

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరువ చేసేందుకు అధికారులు నిబద్ధతతో పని చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక సొసైటీ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

- Advertisement -

అనంతరం ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరుచుకుని ప్రభుత్వ విధానాలను అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జడ్పీటీసి జాటోత్ ఝాన్సీలక్ష్మీ, సంబంధిత శాఖ అధికారులు ఎంపిడివో రవీందర్, కె.రామారావు, బి.పూల్ చందు, వసుంధర, సజన్ స్వరూప్, పంచాయతీ కార్యదర్శులు, సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News