నలుగురు ఆగంతకులు పార్లమెంట్ లోపల, వెలుపల భయాందోళనలు సృష్టించి, దాడికి విఫలయత్నం చేశారు. మరోవైపు దాడికి ప్రయత్నించిన వారిని ఎంపీలు, భద్రతా సిబ్బంది పట్టుకుంది. పార్లమెంట్లోపల, బయట కూడా కలర్ గ్యాస్ వదిలారు.
22 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరుగగా మళ్లీ మరోసారి అదే రోజు ఇలాంటి దుర్ఘటన జరగటం కలవరపాటుకు గురిచేస్తోంది. కాగా పార్లమెంట్ పై దాడి చేస్తామంటూ ఈమధ్యనే ఖలిస్థాన్ నేతలు బాహాటంగా చేసిన ప్రకటనలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.
అసలు పార్లమెంట్ లోకి ఎంటర్ అవ్వాలంటేనే 5 అంచలు భద్రతా వలయాన్ని దాటుకుని వెళ్లాలి అలాంటిది ఈ ఆగంతకులు ఎలా భవనం లోపలకు, ముందుకు వచ్చారన్నది అంతుచిక్కటం లేదు. కాగా ఒకరు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూసుకురాగా అతని వద్దనుంచి విజిటర్ పాస్ భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంది. పార్లమెంట్ బయట ఓ మహిళను, ఆగంతకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.