ఆళ్లగడ్డ నియోజకవర్గ కేసీకెనాల్ రైతులు ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని కలిశారు. పట్టణంలోని ఎమ్మెల్యే గంగుల నాని కార్యాలయంలో కేసీ కెనాల్ రైతులు భూమా చెంచు రెడ్డి, బత్తుల నాగేశ్వరరావు యాదవ్, బ్రహ్మయ్య ఇతర రైతులు ఎమ్మెల్యే గంగుల నానిని కలిసి కేసి కెనాల్ కు చివరి ఆయకట్టు వరకు ఒక తడి నీరు అవసరం ఉందని ఎమ్మెల్యే గంగుల నానికి తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన రాష్ట్రజల వనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డికి, సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన వారు, ప్రస్తుతం ముచ్చుమరి ఎత్తిపోతల వద్ద మూడు మోటార్లు రన్నింగ్ లో ఉన్నాయని ఒక పంపు రిపేర్ లో ఉందని తెలిపారు. రిపేర్ లో ఉన్న పంపును పునర్ధరించి నీటిని కేసీ కెనాల్ కు వదిలితే చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా అవుతుందని తెలిపారు. వెంటనే వారు స్పందించి రిపేర్ లో ఉన్న పంపును పునర్దరించి మొత్తం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని వారబందీ ప్రకారం చివరి ఆయకట్టుకు నీరు సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గంగుల నాని తెలిపారు. చివరి ఆయుకట్టుకు నీరు వస్తే పూర్తి పంటలు చేతికి వస్తాయని అన్నారు. కేసీ కెనాల్ రైతులు వచ్చి అడిగిన వెంటనే స్పందించి కృషి చేస్తున్న జల వనరుల శాఖ రాష్ట్ర సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల నానికి కెసి కెనాల్ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Allagadda: ఎమ్మెల్యే గంగులని కలిసిన కేసి కెనాల్ రైతులు
ముచ్చుమరి ఎత్తిపోతల వద్ద పనిచేయని పంపు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES