గ్రామీణ తపాలా ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక తపాలా శాఖ కార్యాలయం ఎదుట గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది తపాలా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016లో గ్రామీణ తపాలా ఉద్యోగుల పరిస్థితి తెలుసుకునేందుకు నియమించిన కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన రిపోర్టును అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. జీడీఎ్‌సలకు 8 గంటల పని విధానం, పెన్షన్‌తో పాటు అన్ని రకాల ప్రయోజనాలు కల్పించాలని
సమాన పనికి సమాన వేతనంతో పాటు పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే
న్యాయమైన ఇతర డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు లేకపోతే నిరవధిక సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తపాల ఉద్యోగులు జమీల, అరుణ్ కుమార్, చంద్రశేఖర్, సురేష్, ప్రవీణ్, నవీన్, బాలరాజు, మణికంఠ, ప్రకాష్, మహేష్, రేణుక, అనూష, కవిత, వేణు ముజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.