ప్రజాభవన్ వద్ద ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి, డిప్యుటీ సీఎం భట్టీ విక్రమార్క కుటుంబం ప్రజాభవన్ లోకి గృహప్రవేశం చేసింది. ఆతరువాత భట్టీ దంపతులు హోమం నిర్వహించారు. ప్రజాభవన్ లో గృహప్రవేశం పూర్తయ్యాక ఆయన డిప్యుటీ సీఎం ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం 8;21 గంటలకు తన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎంకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్కో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరిత తదితర ఉన్నతాధికారులు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ తదితరులు.