శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచహ్నదీక్షతో 7 రోజులపాటు ఘనంగా జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా స్వామివారి యాగశాల ప్రవేశం చేసి వైభవంగా ప్రారంభించారు ఆలయ ఈవో ఎస్.లవన్న. యాగశాలలో శాస్త్రోక్తంగా గణపతిపూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణ ధారణ ,అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మొదలైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రోజూ వివిధ వాహన సేవలతో శ్రీ స్వామి ఆమ్మవార్లు భక్తులకు దర్శమివ్వనున్నారు.
Srisailam: శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES