Friday, November 22, 2024
Homeఇంటర్నేషనల్Oprah Winfrey journey from Fat to Fit: 70 ఏళ్ల వయసులో ఎట్టకేలకు సన్నబడ్డ...

Oprah Winfrey journey from Fat to Fit: 70 ఏళ్ల వయసులో ఎట్టకేలకు సన్నబడ్డ ఓప్రా విన్ఫ్రే

ఇక చాలు షేమింగ్ భరించలేనని సన్నబడ్డ సెలబ్రిటీ జర్నలిస్ట్

“ఇక చాలు షేమింగ్ భరించలేన”ని ప్రముఖ సెలబ్రిటీ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే సన్నబడి అందరికీ షాక్ ఇచ్చారు.  ఇప్పుడామె మరింత యంగ్ అండ్ డైనమిక్ గా అందరికీ నయా ఛాలెంజెస్ విసిరేస్తూ, ఎన్నో సలహాలు-సూచలను ఇచ్చేస్తున్నారు.

- Advertisement -

ఫోర్బ్స్ మోస్ట్ ఇన్ఫ్ల్యూయెన్షియల్ వల్డ్ పర్సనాలిటీగా ఎంతో కాలంగా వెలుగొందుతున్న ఓఫ్రా సన్నబడ్డాక మెరుపుతీగగా మారి తన ఇమేజ్ ను మరింత పెంచుకుని మళ్లీ తన రికార్డు తనే బద్ధలు కొట్టుకుంటూ ఇంకా పెద్ద ఇన్ఫ్ల్యూయెన్షియల్ పర్సనాలిటీగా ఆవిర్భవించటం మరో హైలైట్.

తాను యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేదో అచ్చం ఇప్పుడు అలానే వైబ్రంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఓప్రా విన్ఫ్రే చెబుతూనే, బరువు వదిలించుకునేందుకు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు వెల్లడించారు.  నెక్ట్స్ మంత్ 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఓప్రా గత కొన్నేళ్లుగా ఒబేస్ బాడీతో ఎన్నో అవమానాలు, ట్రాలింగ్ కు బలైనట్టు వివరించారు. 

  భారీ కాయంతో తన దృష్టిలోనే తాను ఎన్నోమార్లు దిగజారిపోయినట్టు ఫీలైనట్టు, ఇప్పుడు చాలా లైట్ గా, హ్యాపీగా, ఎంతో రిలీఫ్ గా సరికొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.   2021లో మోకాలి మార్పిడి సర్జరీతో ఆమె ఈ సరికొత్త జీవితాన్ని ప్లాన్ చేసి, సిస్టమాటిక్ గా లైఫ్ ను లీడ్ చేయటం మొదలుపెట్టినట్టు, ఆరోగ్యకరమైన రొటీన్, హెల్తీ లైఫ్ స్టైల్ కోరుకుని అందుకు తగ్గట్టుగా ప్రతివారం డైటరీ గోల్స్ ను రీచ్ అయినట్టు వెల్లడించటం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. 

డైటరీ ఛేంజెస్ లో భాగంగా ఓ గ్యాలన్ నీళ్లు తాగే తాను రోజు సాయంత్రం 4 గంటలకల్లా తన లాస్ట్ మీల్ తీసుకుని ఆతరువాత మూతి కట్టేసుకుని ఉన్నట్టు వెయిట్ లాస్ జర్నీని వివరించారు.  అయితే విల్ పవర్ బాగుంటేనే వెయిట్ లాస్ అనే జర్నీని సక్సస్ఫుల్గా పూర్తీ చేయగలమని ఆమె నొక్కి చెబుతున్నారు.  ఇక తాను వాడిన డ్రగ్ (మెడిసిన్) ఏమిటని ఆమె వెల్లడించినప్పటికీ తన స్థూలకాయానికి తనను తానే నిందించుకున్నట్టు ఆమె తాజాగా వెల్లడించారు.  కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ఆమె ఎన్నడూ తన బరువు గురించి పెద్దగా మాట్లాడింది లేదు.  కానీ వయసు మీదపడేకొద్దీ ఆమె పాత రోజులను గుర్తు చేసుకోవడం, కొత్త అనారోగ్య సమస్యలను పదేపదే తనలో తాను అంతర్మథనం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.

అయితే హంగర్ సిగ్నల్స్ (ఆకలిని నియంత్రించి కడుపు ఫుల్గా ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేయటం, దీంతో తక్కువ ఫుడ్ తింటాం అలా క్రమంగా బరువు తగ్గుతుందన్నమాట) రెగ్యులేట్ చేసే ఒజెంపిక్, వెగోవీ వంటి డ్రగ్స్ ను ఆమె ప్రయోగించినట్టు కొందరు భావిస్తుండటం విశేషం.  అయితే ఈ డ్రగ్స్ వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వాంతులు, విరోచనాలు, మలబద్దకం వంటి ఎన్నో సమస్యలు చుట్టుముట్టి బాగా అనారోగ్యంగా ఫీల్ అవుతారని వైద్యులు వీటిని వాడద్దని హెచ్చరిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటములను సైతం ప్రభావితం చేసిన ఓప్రా సన్నబడటం అతిపెద్ద వార్తగా మారింది. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి బరువు తగ్గి మరింతమందికి రోల్ మోడల్ గా నిలవటాన్న గ్రేట్ జర్నీగా అభివర్ణిస్తున్నారు ప్రముఖులంతా. న్యూస్ మేకర్ అయిన ఓప్రా స్వయంగా న్యూస్ గా మారటం ఆసక్తికరమైన వార్త.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News