ఫుడ్ డెలివరీ చేసే ఏజెంట్లు వరుస ప్రమాదాలకు గురవుతున్నారు. ఓవైపు రోడ్డు ప్రమాదాలు మరోవైపు కస్టమర్ల మాటల దాడి, చేతల దాడి వంటివి పదేపదే జరుగుతున్నాయి. తాజాగా ఇలా ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన స్విగ్గీ డెలివరీ బాయ్ పై కుక్క దాడి చేసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లుంబిని రాక్ కేసిల్ అపార్ట్మెంట్ లో ఫుడ్ డెలివరికి వెళ్లిన వ్యక్తిపై పెంపుడు కుక్క దాడి చేయగా, తప్పించుకునేందుకు ప్రయత్నించి మొదటి అంతస్తు నుంచి జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి..హుటాహుటిన హాస్పిటల్ తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇంటి ఓనర్ శోభన పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఇలా పెంపుడు కుక్కల దాడిలో చాలామంది జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ తీవ్రంగా గాయపడుతున్నారు.
Hyd: ఫుడ్ డెలివరీ బాయ్ పై పెంపుడు కుక్క దాడి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES