ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే సీఎం ప్రయాణించే వాహనాల శ్రేణితో ఎవరూ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరాదంటూ సీఎం రేవంత్ ఆదేశించారు.
సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ సూచించారు. సిఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సి.ఎం కోరారు.