పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై నేడు డా.బీ.ఆర్ . అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వి, సి.ఎం ఓ అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ కాసీం, ఆర్థిక శాఖా కార్యదర్శి శ్రీదేవి, నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటు, పాట్లు, వాటిని వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను సి.ఎం ఆదేశించారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.