Friday, September 20, 2024
Homeహెల్త్Skin care in Winter: చలికాలంలో చర్మాన్ని మెరిపించే డైట్

Skin care in Winter: చలికాలంలో చర్మాన్ని మెరిపించే డైట్

విటమిన్ సీ, కే బాగా తినండి

చలికాలంలో చర్మం తొందరగా దెబ్బతింటుంది. దానికి కాస్మొటిక్స్ మాత్రమే పరిష్కారం కాదు. మనం తినే ఆహారంపై కూడా మన చర్మ ఆరోగ్యం, నునుపుదనం, మెరుపు ఆధారపడి ఉంటుంది. చలికాలంలో మనం తీసుకునే ఆహారం బట్టి కూడా చర్మం కాంతివంతంగా ఉంటుంది. చలికాలంలో వీచే చలిగాలి వల్ల చర్మం పొడారినట్టు అవుతుంది. పగిలినట్టు అవుతుంది. కాంతివిహీనంగా కనపడుతుంది. ఈ సమస్యలను తగ్గించే శీతాకాలం డైట్ ఉంది.

- Advertisement -

చలికాలంలో నెయ్యి తింటే మంచిది. ఇది శరీరానికి కావలసిన వేడిని అందిస్తుంది. నెయ్యిని మీరు తినే రోటీ, కూరగాయలు, కాయగూరల్లో , పప్పుల్లో, అన్నంలో వాడొచ్చు. నెయ్యి చర్మాన్ని నునుపుగా చేస్తుంది. అంతేకాదు శరీరానికి అది తగినంత వేడినందించడం వల్ల చలిగాలుల నుంచి చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే వింటర్ లో కమలాపండ్లు తినాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండులో జ్యూసు కూడా బాగా ఉంటుంది. ఈ పండు చర్మానికి చేసే మేలు ఎంతో. కమలా పళ్ల జ్యూసు లేదా పండు తొనలు శీతాకాలంలో నిత్యం తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. అలాగే శీతాకాలంలో పాలకూర, క్యాబేజీ, మెంతాకు,బ్రొకోలీ వంటివి తింటే చర్మానికి ఎంతో మంచిది. కేల్ అయితే స్కిన్ కేర్ సూపర్ స్టార్ అంటారు చర్మనిపుణులు.

ఇందులో విటమిన్ సి, కె, ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ టిష్యూలను మెరుగ్గా చేస్తాయి. ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అంతేకాదు శీతాకాలంలో కూడా మీ చర్మాన్ని మ్రుదువుగా, మెరుపులు చిందేలా ఉంచుతాయి. శీతాకాలంలో నిత్యం నట్స్ తింటే కూడా ఎంతో మంచిది.

బాదం, వాల్నట్స్, జీడిపప్పులలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర అవసరాలనన్నింటినీ కూడా తీరుస్తాయి. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ముఖ్యంగా నట్స్ వల్ల చర్మం ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. చలికాలం సూపర్ హీరో బెల్లం. ఈ కాలంలో శరీరానికి బెల్లం అందించే వెచ్చదనం ఎంతో. అందుకే శీతాకాలంలో స్వీట్లల్లో, రకరకాల రెసిపీల్లో బెల్లం వాడమంటున్నారు
నిపుణులు. ఇది ఆరోగ్యపరంగా మంచి ప్రత్యామ్నాయం మాత్రంమే కాదు రుచిలోనూ హీరోనే. అందుకే శీతాకాలంలో ఈ ఫుడ్ ను బాగా తిని మెరిసిపొమ్మంటున్నారు చర్మనిపుణులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News