క్రీడా పోటీల్లో గెలుపు, ఓటమి సహజమని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని గార్ల బయ్యారం సీఐ బాబురావు అన్నారు. గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి క్రీడా మైదానంలో గార్ల బయ్యారం సర్కిల్ పోలీస్ గార్ల బయ్యారం ప్రెస్ తో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. తొలుత బయ్యారం గార్ల ప్రెస్ కు క్రికెట్ మ్యాచ్ నిర్వహించగా 10 ఓవర్లకు బయ్యారం ప్రెస్ టీం 75 పరుగులు చేసి ఆరు వికెట్లతో నష్టపోయింది అనంతరం బరిలో దిగిన గార్ల ప్రెస్ టీం 115 పరుగులు తీసి విజయం సాధించారు ఫైనల్ మ్యాచ్ లో గార్ల ప్రెస్ పోలీస్ టీంకు మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ వేయగా పోలీస్ టీం జట్టు టాప్ నెగి బ్యాటింగ్ ఎంచుకుంది. 15 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా బరిలో దిగిన గార్ల ప్రెస్ 97 పరుగులు తీసి ఏడు వికెట్లతో నష్టపోగా 46 పరుగుల తేడాతో పోలీస్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా సిఐ బాబురావు మాట్లాడుతూ గెలుపోటములు సహజమని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఓటమితో క్రీడాకారులను నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందెందుకు కృషి చేయాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందని స్నేహభావం పెంపొందుతుందన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రెస్ టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఆటకు వ్యాఖ్యాతగా సూత్రపు రాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గార్ల ఎస్సై బానోతు వెంకన్న, బయ్యారం ఎస్ఐ ఉపేందర్, ప్రెస్ టీం సభ్యులు కైలా ప్రకాష్ సోమయ్య సంపసాల వెంకటేశ్వర్లు స్వామి వీరన్న రవి వెంకట్ కొండ రాము సతీష్ శ్రీను సురేందర్ కృష్ణ శ్రీకాంత్ జాన్ కాన్ పోలీస్ టీం మంగీలాల్ శ్రీను శంకర్ శ్రీకాంత్ కృష్ణ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.