రైలు ప్రయాణంలో వైఫై వచ్చేలా, సూపర్ ఇంటీరియర్స్ తో, బయో వాక్యూమ్ తో కూడిన బయో టాయ్లెట్స్ లో టచ్ ఫ్రీ కన్వీనియెన్స్, జీపీఎస్ తో కనెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతూ ప్యాసింజర్లకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ నిరంతరం కనిపించటం, డిఫ్యూజ్డ్ ఎల్ఈడీ లైటింగ్, ప్రతి సీటు కింద సెల్-ల్యాప్ టాప్ చార్జింగ్ పాయింట్స్, ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా చదువుకోవడానికి టచ్-బేస్డ్ రీడింగ్ లైట్స్, ప్రతి బెర్త్ కు రోలర్ బ్లైండ్స్ తో ప్రైవసీ ఉండేలా కర్టన్లు.. ఇలాంటి అత్యాధునిక సదుపాయాలను వారణాసి-కన్యాకుమారి వందేభారత్ ట్రైన్లో కల్పిస్తోంది ఇండియన్ రైల్వేస్.
వందే భారత్ రైళ్లన్నీ కంప్లీట్ ఏసీ అయితే. ఇందులో ఇంటెలిజెంట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టం ఉండటంతో వాతావరణాన్ని బట్టి, రైలులో ఉన్న ప్రయాణికుల సంఖ్యను బట్టి ఆటోమేటిక్ గా టెంపరేచర్ కు తగ్గట్టు ఏసీ గాలి వీస్తుంది. జెర్మ్ ఫ్రీ గాలిని ఈ ఎయిర్ కండిషనర్స్ సప్లై చేయటం మరో హైలైట్.
కాశీ నుంచి కన్యాకుమారికి వెళ్లే ఈ వందేభారత్ ట్రైన్ ఉత్తర-దక్షిణాదిని కలిపేలా ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి కన్యాకుమారి కుబ్జం వరకు ఈ ప్రతిష్ఠాత్మక రైలును ప్రారంభించి, బెనారస్ ను తమిళులకు మరింత చేరువ చేస్తున్నట్టు మోడీ పేర్కొన్నారు.