Saturday, November 23, 2024
HomeతెలంగాణSeethakka: రామప్పను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

Seethakka: రామప్పను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

కుటుంబ సమేతంగా రామలింగేశ్వర స్వామి దర్శించుకున్న మంత్రి సీతక్క

యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను పర్యాటక ప్రాంతంగా మార్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. వెంకటాపూర్ మండలం రామప్పలోని రామలింగేశ్వర స్వామిని మంత్రి కుటుంబ సమేతంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్పకు చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐ టి డి ఏ పి ఓ అంకిత్, అదనపు కలెక్టర్ శ్రీజ, దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
దైవ సాక్షిగా ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని, ప్రతి గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసని ప్రతి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటా ప్రజా పరిపాలన అందిస్తానని అన్నారు. వనదేవతల సాక్షిగా ములుగు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నాని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతామని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అర్హులైన వారికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. జాతీయ గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఎంతో ప్రసిద్ధి గాన్చిందని రామప్ప ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని తప్పకుండా ప్రత్యేక నిధుల ద్వారా ఆలయాన్ని మరమ్మత్తు చేయిస్తానని అన్నారు. సాగు చేసుకునే ప్రతి రైతుకు పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పోడు భూములకు పోడు పట్టాలు అందిస్తాం అన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News