మరిగే నీళ్లల్లో బాదం పప్పులు వేసి పది నిమిషాలు ఉంచిన తర్వాత పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
పాలరాతి మీద కూరగాయలు తరిగితే కత్తి పదును పోతుంది కాబట్టి చాపింగ్ బోర్డు వాడాలి.
ఫ్లవర్ వాజ్ లో పెట్టిన పూలు ఎక్కువ రోజులు వాడకుండా ఉండాలంటే అందులో పోసే నీటిలో కాస్త ఉప్పు వేయాలి.
పసుపుగా మారిన దంతపు వస్తువులను నిమ్మచెక్కతో రుద్దితే తెల్లగా అవుతాయి.
ఫర్నీచర్ పై పడ్డ మరకలను షూపాలిష్ తో తుడిస్తే పోతాయి.
ముత్యాల నగలను గాలి తగిలేలా ఉంచాలి. లేకపోతే అవి రంగుమారతాయి.
కొద్ది రోజులు వాడిన తర్వాత ఫ్లాస్కులు వాసన వస్తాయి. ఈ వాసన పోవాలంటే వెనిగర్ కలిపిన వేడి నీటిని ఫ్లాస్కులో పోసి అందులో గుడ్డు పెంకులను వేసి నాలుగైదు గంటలు అలాగే ఉంచితే ఆ దుర్వాసన
పోతుంది.