పార్లమెంట్ లో ఈరోజు ఏకంగా 100 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేశారు. గత వారం 14 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన పార్లమెంట్ ఈరోజు పలు దఫాలుగా పదుల సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయటం విశేషం.
- Advertisement -
పార్లమెంట్ పై దాడికి దుండగులు ప్రయత్నించిన నేపథ్యంలో పార్లమెంట్ భద్రతపై హోంశాఖా మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని, దాడి అంశంపై చర్చించాలంటూ లోక్ సభ, రాజ్యసభలో విపక్షాలు పట్టుబడుతూ, పదేపదే సభలో ఆటంకాలు సృష్టించటంతో ఉభయ సభల్లోనూ సభ్యుల సస్పెషన్స్ రోజంతా సాగింది.
కాగా సర్కారు తమను అణచివేస్తోందని, తాము చేస్తున్న డిమాండ్ ఏమాత్రం తప్పు కాదని ప్రతిపక్ష కూటమి ఇండియా అలయన్స్ గట్టిగా వాదిస్తోంది. కాగా సర్కారు మాత్రం పార్లమెంట్ దాడిపై ఇప్పటి వరకు సభలో ఎటువంటి ప్రకటన చేయకపోవడం యావత్ జాతిని ఆలోచింపచేస్తోంది.