Thursday, April 10, 2025
Homeచిత్ర ప్రభAdipurush: సరికొత్త వివాదాల్లో 'ఆదిపురుష్'..కాస్ట్యూమ్స్ పై రచ్చ

Adipurush: సరికొత్త వివాదాల్లో ‘ఆదిపురుష్’..కాస్ట్యూమ్స్ పై రచ్చ

ఆదిపురుష్ పై మరో కొత్త వివాదాల్లో చిక్కుకుంది. ఓవైపు మేకప్, క్యారెక్టరైజేషన్, యానిమేషన్ వర్క్ బాగాలేదని..అభ్యంతరకరంగా ఉందని, హిందువుల మనోభావాలు నొప్పించేలా ఉందనే కేసు కోర్టులో నడుస్తోంది. మరోవైపు సీతా దేవి వస్త్రధారణ చాలా అభ్యంతరకరంగా ఉందంటూ పిల్ దాఖలైంది. సీత కాస్ట్యూమ్స్ వివాదంపై తదుపరి వాదనలు వచ్చే నెల 21న లక్నో బెంచ్ ముందుకు రానుంది. ఆదిపురుష్ సినిమా రిప్లై ఫైల్ చేయాల్సిందిగా ఇప్పటికే అలహాబాద్ హై కోర్టు సెన్సార్ బోర్డ్ కు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

కుల్దీప్ తివారీ అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. రాముడు, సీతా దేవిపై ప్రజల మనోభావాలు చాలా లోతుగా ఉన్నాయని, ఆదిపురుష్ ప్రోమోలో ఇవన్నీ అగౌరవ పరిచేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతా దేవిగా కృతి సనన్ నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా, భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News