బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మండల ఎంపీపీ మూడ్ శివాజీ చౌహాన్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవితకు శనివారం అందించి రాజీనామా లేఖను విలేకరులకు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీలో సహకరించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి మాళోత్ కవితా, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, మండల ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.