Saturday, November 23, 2024
HomeదైవంHyd: వైభవోపేతంగా అలరించిన శ్రీమన్నారాయణుని ఆరాధన

Hyd: వైభవోపేతంగా అలరించిన శ్రీమన్నారాయణుని ఆరాధన

ముక్కోటి ఏకాదశి సందర్భంగా..

అన్నమయ్యపురంలో వైభవోపేతంగా అలరించిన శ్రీమన్నారాయణుని ఆరాధన

- Advertisement -

వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్నమయ్యపురంలో భక్తులు ఉదయం 5:30 గం.ల నుండి శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం 5. గం.ల నుండి ఆదివారం ఉదయం 6 గం.ల వరకు నిర్విరామంగా శ్రీమన్నారాయణుని ఆరాధన అటు స్వరార్చన, ఇటు నృత్యార్చనతో కలసి దిగ్విజయంగా జరిగింది.

ఇందులో భాగంగా పద్మశ్రీ డా. శోభా రాజు వయోభేదం లేకుండా వైకుంఠ వాసం భజే అనే సంకీర్తన ఉచితంగా నేర్పించారు. విద్యార్థులు, భక్తులు సంయుక్తంగా ఆ వైకుంఠ వాసునిపై భక్తితో ఆలపించారు.

అంతే గాక, పద్మశ్రీ శోభా రాజు గారి శిష్య బృందం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం పారాయణం, గురుస్తుతి నివేదించగా,

అనంతరం, శారద మ్యూజిక్ అకాడమీ వారి స్వరార్చన, శ్రీమతి సంధ్యా రాజు (నాట్యం ఫేమ్) గారి నృత్యార్చన, సాయిసన్నిధి కూచిపూడి డాన్స్ అకాడమీ వారి గురువు వి.రాధిక శ్రీనివాస్ గారిచే నృత్యార్చన అందరిని ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా శ్రీకరి, శాంకరి, హిమబిందు, లావణ్య, మోక్ష, శృతి, నేహా, శాన్వి, శ్రద్ధ, గౌతమి, కృతేష్ సంయుక్తంగా శ్రీ మన్నారాయణ, వినరో భాగ్యము, అన్నిమంత్రములు, తిరుమలగిరి రాయ, గోవిందాశ్రిత, నారాయణతే నమో నమో, తిరు తిరు జవరాల, చక్కని తల్లికి, ఇట్టి ముద్దులాడి, గోవింద గోవిందయని కొలువరే, ముద్దుగారే యశోద, బ్రహ్మమొక్కటే అనే బహుళ ప్రచారంలో ఉన్న అన్నమ సంకీర్తనలకు స్వరార్చన-నృత్యర్చన చేశారు.

తదుపరి అన్నమయ్యపురంలో 6 సంచికల “శ్రీ అన్నమాచార్య” టెలీ సిరీయల్ ఎల్సీడీ తెర మీద ప్రదర్శన చేశారు. భక్తుల ప్రశ్నలకు శోభారాజు గారు సమాధానపరిచారు.

అటు పిమ్మట అన్నమాచార్య భావనా వాహిని శిష్య బృందంచే సంకీర్తనార్చన నిర్విరామంగా ఉదయం 6 గం.ల వరకు జరిగింది.

చివరిగా అన్నమయ్య సమేత శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ మరియు మంగళ హారతితో వైభవోపేతంగా ముగిసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News