Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Bhuma Akhila: ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల మార్పు

Bhuma Akhila: ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల మార్పు

రైతులకు ఇచ్చిన హామీ ఏమయ్యాయి

రాష్ట్రంలో ఐదు సంవత్సరముల వైసిపి పాలనలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు కబ్జాలు అభివృద్ధి లేని సంఘటనలు ప్రతిపక్షం మీద తప్పుడు కేసులు జైలుకు పంపించడం ఇసుక లేక నిర్మాణాలన్ని ఆగిపోయాయని అభివృద్ధి కూడా మరిచిపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులలో మళ్లీ మన రాష్ట్రంలో ఒక నమ్మకమైన ఒక కొత్త ఉత్సాహం అవసరమని భావించి టిడిపి జనసేన కలిసి రావడం అలాగే రాష్ట్రం బాగుపడాలంటే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన విజయనగరంలో యువగళం విజయ యాత్ర సభలో ఆరు లక్షల మంది హాజరయ్యారని రాష్ట్ర ప్రజలకు అండగా మేము ఉన్నామని చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ బాలకృష్ణ యువ నాయకులు నారా లోకేష్ ప్రజలకు ధైర్యాన్ని నింపారన్నారు విజయనగరం విజయాత్ర సభను చూసి వైసిపి నాయకులలో గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యేల 70 మందిని ఎమ్మెల్యేలను మారుస్తున్నట్టు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటె ఉన్న ఎంతవరకు అవినీతి జరిగిందో చెప్పాల్సిన పని లేదన్నారు. ఓటమి భయంతోనే వారందరినీ మారుస్తున్నారని ఆమె అన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అన్నింటా పూర్తిగా విఫలమైందన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఆళ్లగడ్డలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు రౌడీయిజం గుండాయిజం ఎక్కువైందన్నారు వ్యాపారస్తులను బెదిరిస్తున్నారని వారికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని అన్నారు. చందలూరు మందలూరు గ్రామాలకు సాగునీరు రాకుండా యర్రగుడి దిన్నెలో అడ్డగించి చెరువులు నింపుకొని ఎమ్మెల్యే బిజెం ద్రా రెడ్డి బంధువులు చెరువులో చేపలు వదులుకొని వ్యాపారం చేస్తున్నారన్నారు.మూడు గ్రామాలు రైతులు సాగునీరు కావాలంటే ఆ గ్రామాల రైతులు డబ్బులు ఇస్తేనే నీళ్లు వదులుతామని అనడం సిగ్గుచేటని భూమా అఖిల ప్రియ ఆరోపించారు. అంగన్వాడికార్యకర్తలు వారి సమస్యలు కోసం ధర్నాలు చేస్తుంటే వారికి ప్రత్యామకంగా సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేసి వారి సెంటర్లను పగలగొట్టించడం సిగ్గు చేటు అన్నారు. వారి న్యాయమైన కోరికలు తీర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News