Friday, November 22, 2024
HomeదైవంMaddileti Swamy: వైభవంగా మద్దిలేటి స్వామి కల్యాణం

Maddileti Swamy: వైభవంగా మద్దిలేటి స్వామి కల్యాణం

బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం గ్రామపరిధిలో కొలువైవున్న ,ప్రముఖ వైష్ణవ క్షేత్రం అగు శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామి వార్ల ఉత్తర ద్వారదర్శనం వేలమంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీమద్దిలేటీ స్వామి అమ్మ వార్ల ముక్కోటిఏకాదశి ఉత్తరద్వార దర్శనం గత చరిత్రలో ఎప్పుడూకూడా ఇంతటి జనసందోహంతో జరగలేదు.

- Advertisement -

శ్రీ మద్ది లేటీ స్వామి దేవాలయ అభివృద్దికి విశేష కృషి చేసిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పట్టుదలైన కృషి వల్ల, రంగాపురం నుండి దేవాలయం వరకు మంచి డబుల్ రోడ్ సౌఖర్యం కలిగినందువల్ల దేవాలయ పరిసర ప్రాంతాలలో రోడ్ సౌఖర్యంతోపాటు,స్వామి వారి చెంతకు నూతన సిమెంట్ రోడ్ నిర్మించుట వలన ఈ సంవత్సరం,ముక్కోటి ఏకాదశి ఉత్సవములకు, ఉత్తర ద్వార దర్శనం నకు భక్తులు పోటెత్తారు.

ఉత్తర ద్వార దర్శనంనకు సుదూర ప్రాంతాలనుండి బస్సులలో,లారీ,మినీ లారీలలో, మ్యాజిక్ ఆటోలలో కార్లలో,జీపులలో, టూవీలర్లపైన, భక్తులు తండోప తండాలుగా కదలివచ్చి స్వామి అమ్మవార్లను అశేష జనం దర్శించుకున్నారు. ఆర్ఎస్. రంగాపురం ఆటో డ్రైవర్లు రంగాపురం నుండి మద్దిలేటి స్వామి దేవాలయం వరకు ముక్కోటి ఏకాదశి శనివారం భక్తుల కు ఉచితంగా సర్వీస్ చేశారు. బేతంచెర్ల సుమేధ స్కూల్ యాజమాన్యం వారి స్కూల్ బస్సులు ఉచితంగా బేతంచెర్ల నుండి స్వామి దేవాలయం వరకు ప్రయాణసౌఖర్యం కల్పించారు. ఆటిసి బస్సులు నడిచాయి. మొత్తానికి ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఉత్సవములు దేవాలయ కార్యనిర్వహణ అధికారి డి. పాండురంగారెడ్డి,ఆలయ సిబ్బంది, దేవాలయధర్మకర్తల మండలి చైర్మన్ బి. సీతారామచంద్రుడు మరియూ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక బృందం, సేవా తత్పరులు కలిసిశ్రీ మద్దిలేటీ స్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవములను జయప్రదం గావించారు.

ముక్కోటి దేవతల సాక్షిగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఘన మద్దిలేటీ నరసింహ స్వామి కళ్యాణము శనివారం నాడు ఆలయ పురోహితులు ఘనంగా నిర్వహించారు. అశేష తిలకించిన జన సందోహం కళ్యాణానికి తరలివచ్చారు మహిళలు, అధిక సంఖ్యలో కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణానికి భారీ ఎత్తున వచ్చిన మహిళలు భక్తి శ్రద్దలతో తిలకించారు. శ్రీ స్వామివారి కళ్యాణమునకు 5 గ్రాముల తాళి బొట్లును బి.మద్దిలేటీ మమత హోటల్, కర్నూల్ వారుబహుకరించారు.సాయంత్రం 4 గంటలనుండి ఆర్ఎస్ రంగాపురం పురవీధుల గుండా శ్రీ స్వామి రథోత్సవము, రథోత్సవము వెంబడి శ్రీ సీతారామన్న కోలన్న గ్రూప్ బ్రాహ్మణ క్రాక, ఎస్పఎస్ఆర్ నెల్లూరు వారి కళా బృందం తో కోలాటం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగును ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొన వలయునని శ్రీ మద్దిలేటీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి. పాండురంగారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బి. సీతారామచంద్రుడు తెలిపారు. స్వామి అమ్మవార్ల కళ్యాణంలో డోన్ డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి,బేతంచెర్ల సీఐ ప్రియతమ రెడ్డి, ఆలయ ఈవో పాండురంగారెడ్డి ఆలయ చైర్మన్ జి రామచంద్రుడు పాలకమండలి సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బేతంచెర్ల బనగానపల్లె అవుకు జలదుర్గం పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News