Saturday, November 23, 2024
HomeతెలంగాణRevanth Reddy: డిసెంబర్ 28-జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు

Revanth Reddy: డిసెంబర్ 28-జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు

గ్రామాల్లో దరఖాస్తు స్వీకరణకు కౌంటర్లు

ప్రజా ఆమోదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే రెండు గ్యారంటీలను అమలు చేసాం

- Advertisement -

మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం తీసుకున్నాం

ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ప్రజా పాలన దరఖాస్తులు తీసుకుంటాం.

నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం

సుదూర ప్రాంతాల నుంచి ప్రజాభవన్ కు వచ్చి ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారు.

గత పదేళ్లుగా ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిస్తున్నాం.

ఈ కార్యక్రామాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే…

గడీల నుంచి పాలనను గ్రామాలకు చేర్చాలి..

అందుకే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రతీ సంక్షేమ పథకం ప్రజలకు అందేలా చూసేందుకే ఈ కార్యక్రమం

జనాభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో దరఖాస్తు స్వీకరణకు కౌంటర్లు పెంచుతున్నాం.

గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ కూడా దరఖాస్తులు స్వీకరించే సదుపాయం కల్పిస్తున్నాం

ఎనిమిది రోజుల తరువాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు.

గడువు తరువాత ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఈ ప్రభుత్వం ప్రజలది..ప్రజల కోసం పనిచేస్తుంది.

రేషన్ కార్డులు లేని వారి దరఖాస్తులూ స్వీకరిస్తాం…

కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

గ్రామ సభల్లో అన్ని రకాల దరఖాస్తులను స్వీకరిస్తాం..

కేటీఆర్ కు కౌంటర్

ప్రజావాణిలో న్యాయం జరగలేదని ఓ మహిళకు కేటీఆర్ లక్ష రూపాయలు అందించారని ప్రచారం చేసుకుంటున్నారు.

మహిళకు కేటీఆర్ తో లక్ష రూపాయలు ఇప్పించడంలో ప్రజావాణి విజయవంతమైంది

దోచుకున్న లక్ష కోట్లల్లో లక్ష రూపాయలే కేటీఆర్ పంచారు.

ఖచ్చితంగా మిగతా డబ్బులు ప్రజలకు పంచేలా చేస్తాం

వాళ్లవి ప్రజల రక్తం పిండి సంపాదించిన ఆస్తులు.

ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారు… అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారు.

22 కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారు..

ఐటీఐఆర్ వెనక్కు వెళితే అడగని వినోద్ కుమార్… సైనిక్ స్కూల్ గురించి అడగని ఆయన… బుల్లెట్ ట్రైన్ గురించి మాకు నీతులు చెబుతారా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News