ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. అన్నివర్గాల ప్రభుత్వం. ఈ 55 నెలల కాలంలో మనసున్న ప్రభుత్వంగా పాలన సాగించాం. ఒక ప్రభుత్వంగా ఎంత మేలు చేయాలో అంతా చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశామని మరోసారి మీకు సవినయంగా గుర్తుచేస్తున్నాం. ఇవ్వని హామీలుకూడా అమలు చేసి అందరిలో సంతోషం నింపేదిశగా అడుగులు వేశాం.
అంగన్వాడీ అక్కచెల్లెమ్మల విషయానికొస్తే గత ప్రభుత్వంలో రెండేళ్లపాటు ఒక్కపైసాకూడా వారికి జీతాలు పెంచలేదు. 2016 ఏప్రిల్ 4న అంగన్ వాడీ వర్కర్ల జీతం రూ.4,200 నుంచి, రూ.7,000కు, మినీ అంగన్వాడీ వర్కర్ల జీతాలు రూ.2,950 నుంచి రూ.4,500కు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలు రూ.2,200 నుంచి రూ. 4,500కు పెంచారు.
అంగన్వాడీ అక్కచెల్లెమ్మల అష్టకష్టాలు చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా 2017లో పాదయాత్ర చేస్తున్న సమయంలో వీరి జీతాలు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం మేల్కొని, ఎన్నికలకు ఆరు నెలల ముందు అంగన్వాడీ వర్కర్లకు, మినీ అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్ల జీతాలను పెంచింది. గత ప్రభుత్వం హయాంలో 2019 వరకూ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950లు, అంగన్వాడీ సహాయకురాలికి, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించింది.
అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి అంగన్వాడీ వర్కర్ల జీతాలను రూ.11,500లకు, మినీ అంగన్ వాడీ జీతాలను రూ.7,000కు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలను రూ.7,000కు పెంచింది. ప్రభుత్వం వచ్చిన మరుసటి నెలనుంచే ఈ జీతాలు అమల్లోకి తెచ్చి అంగన్వాడీ అక్కచెల్లెమ్మల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంది.
అక్కడితో ఆగిపోకుండా మంచి పనితీరు కనబర్చిన అంగన్ వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పునకూడా ఇవ్వడం జరుగుతోంది. ఇలా ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం మీకు మరోసారి గుర్తుచేస్తున్నాం.
గతంలో ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్ల ప్రమోషన్లను పట్టించుకోలేదు. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్ల ఇవ్వలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్- 2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీచేసి అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచింది మన జగనన్న ప్రభుత్వం..
ఇదే సందర్భంలో ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసేవారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో 9 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎక్కువ మంది పోటీపడే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి డీబీటీ ద్వారా రూ.1,313 కోట్లు అందించడం జరిగింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ తదితర పథకాలను వారికి వర్తింప చేస్తోంది. తద్వారా వారి కుటుంబాల్లో చిరునవ్వులు చూడాలనే తపన, తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.
అలాగే అంగన్వాడీ వర్కర్లకు వారి కార్యక్రమాలను, విధులను సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలను అందించడానికి కూడా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. రూ.85.47 కోట్లతో 56, 984 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి వారికి అందించింది. డేటా ఛార్జిలను భరిస్తూ అదనంగా డేటా కూడా ఇవ్వడం జరుగుతోంది. 1 జూలై, 2023 నుంచి ఇది అమలవుతోంది. డేటా కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది.
ఈ ఏడాది నుంచి అంగన్ వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమాను కూడా వర్తింపు చేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లించడం జరుగుతోంది. ఒక్కో అంగన్వాడీ వర్కర్కు, హెల్పర్కు 6 చొప్పున రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించడం జరిగింది.
నాడు – నేడు కార్యక్రమాల ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న మన ప్రభుత్వం అంగన్వాడీల్లో కూడా మంచి వసతులు, కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా హోం రేషన్ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వారికి పనిభారం తగ్గడమే కాకుండా పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించే మార్గాలను అంగన్వాడీలకు అందిస్తూ 2023 నుంచి ప్రభుత్వం డ్రైరేషన్ అందిస్తోంది.
ఇదే సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన వివిధ అంశాలను సానుకూలంగా పరిశీలించి వారికి మరింత మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుందని చెప్పేందుకు సంతోషిస్తున్నాం.
అద్దెభవనాల్లో ఉన్న అంగన్ వాడీ సెంటర్లకు రూ.66.54కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. అంగన్వాడి కేంద్రాల్లో పరిశుభ్రత కోసం అవసరమైన చీపుర్లు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 55,607 సెంటర్లకి రూ.7.81కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్లు, చిన్నపాటి మరమ్మత్తుల క్రింద 21,206 అంగన్వాడీ సెంటర్సు ఒకొక్క కేంద్రానికి రూ.3,000/- చొప్పున రూ.6.36 కోట్ల నిధులు విడుదల చేయడమైనది. ఈ నిధులను అంగన్వాడీ కార్యకర్తలే కేంద్రం యొక్క అవసరమును బట్టి ఖర్చు చేసుకునే వీలు కల్పించడమైంది. అంగన్వాడీ సహాయకులను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరములకు పెంచుతూ G.O.MS: 44 తేది 20.12.2023 జారీ చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, అంగన్వాడీ హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం మెమో నెంబర్ 2303564/2023/PROG-I-A1, తేదీ 20.12.2023 ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడింది. జారీ చేయబడిన తేది నుండి ఇది అమల్లోకి వచ్చింది.
అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ కొనసాగింపునకు గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది మరియు రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు రూ.1 లక్షకు మరియు హెల్పర్లకు రూ. 40,000 లకు పెంచుతూ సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించాలని G.O.MS.No: 47 తేది 20.12.2023 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో వయబిలిటీ ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయించింది.
ఇలా అన్నిరకాలుగా అంగన్ వాడీ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. రాబోయే రోజుల్లో కూడా అక్క చెల్లెమ్మలకు మరింత చేయూత నివ్వడానికి కృత నిశ్చయంతో ఉంది.
అంగన్వాడీ అక్కచెల్లెమ్మల్లారా ఒకసారి ఆలోచించండి.. మీ కోర్కెల సాధనకు మీరు చేస్తున్న ధర్నాలను తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకోవాలనే రాజకీయ పార్టీలు, పచ్చ పత్రికలు ఉన్నాయన్న వాస్తవాన్ని మీరు గమనించి అటువంటి శక్తులపట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది. మన అందరిది. మరిన్ని మంచి రోజులు వస్తున్నాయి. కలిసికట్టుగా అడుగులు ముందుకు వేద్దాం.
మీరంతా మా వాళ్లు, మీకు వీలైనంత మంచి చేయాలన్నదే మా తపన. మీ న్యాయమైన కోర్కెలన్నీ ప్రభుత్వం పరిష్కరించడానికి కృత నిశ్చయంతో ఉంది. అయితే మరోవైపు మీరు చేస్తున్న సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సహృదయంతో అర్ధం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ప్రధమ కర్తవ్యం. అందులోనూ గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు మీద మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.. ఈ నేపథ్యంలో వీరి క్షేమం దృష్ట్వా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సిన పరిస్థితిని తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వర్గాల వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అంగన్ వాడీ అక్కచెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి..
ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. అన్నివర్గాల ప్రభుత్వం. ఈ 55 నెలల కాలంలో మనసున్న ప్రభుత్వంగా పాలన సాగించాం. ఒక ప్రభుత్వంగా ఎంత మేలు చేయాలో అంతా చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశామని మరోసారి మీకు సవినయంగా గుర్తుచేస్తున్నాం. ఇవ్వని హామీలుకూడా అమలు చేసి అందరిలో సంతోషం నింపేదిశగా అడుగులు వేశాం.
అంగన్వాడీ అక్కచెల్లెమ్మల విషయానికొస్తే గత ప్రభుత్వంలో రెండేళ్లపాటు ఒక్కపైసాకూడా వారికి జీతాలు పెంచలేదు. 2016 ఏప్రిల్ 4న అంగన్ వాడీ వర్కర్ల జీతం రూ.4,200 నుంచి, రూ.7,000కు, మినీ అంగన్వాడీ వర్కర్ల జీతాలు రూ.2,950 నుంచి రూ.4,500కు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలు రూ.2,200 నుంచి రూ. 4,500కు పెంచారు.
అంగన్వాడీ అక్కచెల్లెమ్మల అష్టకష్టాలు చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా 2017లో పాదయాత్ర చేస్తున్న సమయంలో వీరి జీతాలు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం మేల్కొని, ఎన్నికలకు ఆరు నెలల ముందు అంగన్వాడీ వర్కర్లకు, మినీ అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్ల జీతాలను పెంచింది. గత ప్రభుత్వం హయాంలో 2019 వరకూ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950లు, అంగన్వాడీ సహాయకురాలికి, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించింది.
అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి అంగన్వాడీ వర్కర్ల జీతాలను రూ.11,500లకు, మినీ అంగన్ వాడీ జీతాలను రూ.7,000కు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలను రూ.7,000కు పెంచింది. ప్రభుత్వం వచ్చిన మరుసటి నెలనుంచే ఈ జీతాలు అమల్లోకి తెచ్చి అంగన్వాడీ అక్కచెల్లెమ్మల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంది.
అక్కడితో ఆగిపోకుండా మంచి పనితీరు కనబర్చిన అంగన్ వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పునకూడా ఇవ్వడం జరుగుతోంది. ఇలా ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం మీకు మరోసారి గుర్తుచేస్తున్నాం.
గతంలో ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్ల ప్రమోషన్లను పట్టించుకోలేదు. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్ల ఇవ్వలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్- 2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీచేసి అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచింది మన జగనన్న ప్రభుత్వం..
ఇదే సందర్భంలో ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసేవారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో 9 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎక్కువ మంది పోటీపడే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి డీబీటీ ద్వారా రూ.1,313 కోట్లు అందించడం జరిగింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ తదితర పథకాలను వారికి వర్తింప చేస్తోంది. తద్వారా వారి కుటుంబాల్లో చిరునవ్వులు చూడాలనే తపన, తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.
అలాగే అంగన్వాడీ వర్కర్లకు వారి కార్యక్రమాలను, విధులను సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలను అందించడానికి కూడా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. రూ.85.47 కోట్లతో 56, 984 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి వారికి అందించింది. డేటా ఛార్జిలను భరిస్తూ అదనంగా డేటా కూడా ఇవ్వడం జరుగుతోంది. 1 జూలై, 2023 నుంచి ఇది అమలవుతోంది. డేటా కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది.
ఈ ఏడాది నుంచి అంగన్ వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమాను కూడా వర్తింపు చేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లించడం జరుగుతోంది. ఒక్కో అంగన్వాడీ వర్కర్కు, హెల్పర్కు 6 చొప్పున రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించడం జరిగింది.
నాడు – నేడు కార్యక్రమాల ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న మన ప్రభుత్వం అంగన్వాడీల్లో కూడా మంచి వసతులు, కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా హోం రేషన్ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వారికి పనిభారం తగ్గడమే కాకుండా పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించే మార్గాలను అంగన్వాడీలకు అందిస్తూ 2023 నుంచి ప్రభుత్వం డ్రైరేషన్ అందిస్తోంది.
ఇదే సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన వివిధ అంశాలను సానుకూలంగా పరిశీలించి వారికి మరింత మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుందని చెప్పేందుకు సంతోషిస్తున్నాం.
అద్దెభవనాల్లో ఉన్న అంగన్ వాడీ సెంటర్లకు రూ.66.54కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. అంగన్వాడి కేంద్రాల్లో పరిశుభ్రత కోసం అవసరమైన చీపుర్లు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 55,607 సెంటర్లకి రూ.7.81కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్లు, చిన్నపాటి మరమ్మత్తుల క్రింద 21,206 అంగన్వాడీ సెంటర్సు ఒకొక్క కేంద్రానికి రూ.3,000/- చొప్పున రూ.6.36 కోట్ల నిధులు విడుదల చేయడమైనది. ఈ నిధులను అంగన్వాడీ కార్యకర్తలే కేంద్రం యొక్క అవసరమును బట్టి ఖర్చు చేసుకునే వీలు కల్పించడమైంది. అంగన్వాడీ సహాయకులను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరములకు పెంచుతూ G.O.MS: 44 తేది 20.12.2023 జారీ చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, అంగన్వాడీ హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం మెమో నెంబర్ 2303564/2023/PROG-I-A1, తేదీ 20.12.2023 ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడింది. జారీ చేయబడిన తేది నుండి ఇది అమల్లోకి వచ్చింది.
అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ కొనసాగింపునకు గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది మరియు రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు రూ.1 లక్షకు మరియు హెల్పర్లకు రూ. 40,000 లకు పెంచుతూ సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించాలని G.O.MS.No: 47 తేది 20.12.2023 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
రాష్ట్రంలో వయబిలిటీ ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయించింది.