Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభB Saroja Devi: గ్లామ్ డాల్ బీ సరోజాదేవి

B Saroja Devi: గ్లామ్ డాల్ బీ సరోజాదేవి

మోస్ట్ పాపులర్ సౌత్ ఇండియన్ యాక్ట్రెసెస్ లో బీ సరోజాదేవి పేరు ఫర్ ష్యూర్ఉంటుంది. పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న బీ సరోజాదేవి అప్పట్లో చాలా రోల్స్ ను చాలా బెస్ట్ గా పర్ఫార్మ్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో బీ సరోజాదేవి యాక్ట్ చేశారు. ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేశారు ఆమె. హిందీలో కూడా ఆమె యాక్ట్ చేశారు. లెక్కలేనంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.

- Advertisement -

ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్

ఆ కాలానికే ఆమె ఇండియాలో పెద్ద స్టార్. సింపుల్ గా చెప్పాలంటే ప్యాన్ ఇండియా స్టార్ అన్నమాట. వేర్వేరు లాంగ్వేజెస్ లో ఆమె టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేశారు. ఆడి-పాడి-తెరపై రొమాన్స్ చేశారు. 180కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇన్ని భాషల్లో సుమారు 200 సినిమాలు చేయటమంటే మాటలు కాదు. బెంగళూరులో పుట్టారు బీ సరోజాదేవి. 1942 జనవరి 7వ తేదీన ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. తండ్రి బైరప్ప పోలీస్ గా జాబ్ చేసేవారు. ఈమెకు ముగ్గురు అక్కలుండేవారు.

యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంతే

సరోజాదేవి బ్లడ్ లోనే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. దీనికి కారణం ఆమె తండ్రి బైరప్ప. ఆమె ఫాదర్ కు డ్రామాలంటే చాలా చాలా ఇష్టం. అంతేకాదు పోలీస్ గా పనిచేస్తూనే నాటకాల్లో యాక్ట్ చేసేందుకు పరితపించిపోయేవాడు. తన కూతురు సరోజాదేవిని యాక్ట్ చేయమని చెప్పి, యాక్ట్ చేయించి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అలా ఆమె చిన్నప్పుడే ఇంట్లోనే ఫాదర్ ముందు డ్రామా సీన్స్ పండించేవారన్నమాట. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే ఇదే కదా. ఆతరువాత అదే కెరీర్ గా మారి స్టార్ గా ఎదిగారు.

డ్రామాల్లో కెరీర్

ఆతరువాత స్లోగా డ్రామాస్ లో బీ సరోజాదేవి యాక్ట్ చేసేవారు. ఓసారి ఇలా డ్రామాలో యాక్ట్ చేస్తుండగానే కన్నడ డైరెక్టర్ భాగవతార్ ఆమెను చూసి ఫిదా అయ్యారు. అప్పుడు బీ సరోజాదేవి వయసు జస్ట్ 13 ఏళ్లు. కాళిదాసు సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేయమని భాగవతార్ ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. అంతే ఆ తరువాత ఆమెకు కంటిన్యూగా ఆఫర్స్ రావటం స్టార్ట్ అయింది. అలా ఆమె బెంగళూరు నుంచి చెన్నైకు షిఫ్ట్ అయ్యారు. ఇదే క్రమంలో ఆమెకు తెలుగులో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. పెళ్లిసందడి సినిమాతో తెలుగు వారికి పరిచయమయ్యారు బీ సరోజాదేవి. తెలుగులో ముందు ఆమె సినిమా రిలీజ్ అయింది మాత్రం ‘పాండురంగ మహత్యం’. ఈ సినిమాల్లో ఆమె యాక్టింగ్, అందం ఫ్యాబులస్ అనిపించుకున్నాయి.

మద్రాస్ కా సుందర్ తారా

‘మద్రాస్ కా సుందర్ తారా’ అంటూ నార్త్ ఇండియన్ మీడియా బీ సరోజాదేవిని పొగిడేవి. ఎల్వీ ప్రసాద్ బాలీవుడ్ లో తీసిన ‘ససురాల్’ అనే హిందీ సినిమాతో ఆమెకు మరింత స్టార్డం వచ్చింది. తమిళంలో సరోజా యాక్ట్ చేసిన ‘ఇరంబుతిరై’ అనే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీన్నే హిందీలో రీమేక్ చేశారు. ఈ రీమేక్ లో కూడా సరోజానే హీరోయిన్. అలా ఆమెకు అలనాటి సూపర్ స్టార్ దిలీప్ కుమార్ తో దోస్తీ కుదిరింది. ఆతరువాత వరుసపెట్టి హిందీ సినిమాల్లో బిజీ స్టార్ గా మారారు. హిందీలో దిలీప్ కుమార్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, షమ్మీ కపూర్ లాంటి అప్పటి సూపర్ స్టార్స్ తో యాక్ట్ చేశారు. ‘నజ్రానా’ అనే రాజ్ కపూర్ మూవీలో ఆమె యాక్ట్ చేశారు. కానీ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తో డిఫరెన్సెస్ రావటంతో ఆతరువాత ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పుడు సరోజా ప్లేస్ లో వైజయంతిమాలను పెట్టి సినిమా తీశారు.

లక్కీ మస్కట్

తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషణ్, జెమిని గణేషణ్ లాంటి లెజెండరీ యాక్టర్స్ తో సరోజా ఆడిపాడారు. ఎంజీఆర్ ఈమెను ‘లక్కీ మస్కట్’ అనేవారు. ఆమెతో కలిసి యాక్ట్ చేస్తే ఇక సినిమా పక్కా సూపర్ హిట్ అనేది ఆయన సెంటిమెంట్. ఏకంగా ఆమెతో 26 సినిమాలు చేశారు ఎంజీఆర్. ఎంజీఆర్-బీ సరోజాదేవిది తమిళ్ లో సూపర్ హిట్ జోడీ. శివాజీ గణేషన్-సరోజా కూడా అంతే హిట్ పెయిర్. శివాజీ గణేషన్ తో కలిసి ఆమె బ్యాక్ టు బ్యాక్ 22 తమిళ్ హిట్స్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి పెద్ద హీరోలతో కలిసి ఎన్నో హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. పౌరాణికం సినిమాల్లోనూ ఆమె రాణించారు. ‘భూకైలాస్’ వంటి సినిమాల్లో ఆమె యాక్టింగ్ సూపర్బ్ అనిపించుకుంది.

ఇండస్ట్రీకి ఫ్యామిలీ దూరం

పద్మభూషణ్, ఎన్టీఆర్ అవార్డును అందుకున్నారు బీ సరోజాదేవి. ఆమె బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఇద్దరు కూతుళ్లున్నావాళ్లెవరూ ఇండస్ట్రీలోకి రాలేదు. కొడుకు గౌతం కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. వందకు పైగా సినిమాల్లో యాక్ట్ చేశాక.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సరోజా మ్యారేజ్ చేసుకున్నారు. శ్రీహర్ష అనే ఇంజినీర్ కం బిజినెస్ మ్యాన్ ను ఈమె పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో శ్రీహర్ష జర్మనీలోని సీమెన్స్ కంపెనీలో జాబ్ చేసేవారు. ఆతరువాత ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేశారు. భర్త మరణించాక సరోజానే ఆ వ్యాపార పనులన్నీ చూసుకుంటున్నారు. సరోజా ఇన్కం ట్యాక్స్ చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ను ఎలా డీల్ చేయాలో హర్ష దగ్గరుండి నేర్పారని ఆమె సగర్వంగా చెప్పుకుంటారు.

6 దశాబ్దాల కెరీర్

‘అభినయ సరస్వతి’ అని ఆమెను కన్నడ ఫ్యాన్స్ పిలుచుకుంటారు. ‘కన్నడ రామచిలుక’ అని తమిళ్ ఫ్యాన్స్ పిలుస్తారు. 1958లో ఆమె తమిళ్ టాప్ యాక్ట్రెస్ గా చెలరేగిపోయారు. కన్నడ, తెలుగులోనూ సైమల్టేనియస్ గా టాప్ యాక్ట్రెస్ గా ఆమె చాలాకాలం పాటు హై డిమాండ్ ఉన్న హీరోయిన్ గా వెలగటం పెద్ద రికార్డ్. తమిళనాడు సర్కారు ఇచ్చే అత్యున్నత అవార్డ్.. ‘కలైమామణి’ని కూడా సొంతం చేసుకున్నారు ఆమె. చిన్నప్పుడు స్టూడియోల వెంట సరోజాదేవికి తోడుగాఆమె తండ్రి వెళ్లేవారు. మామూలుగా ఆరోజుల్లో హీరోయిన్స్ అందరికీ వాళ్ల మదర్స్ వెంట రాగా ఈమెకు మాత్రం వాళ్ల ఫాదర్ సపోర్ట్ గా ఉండేవారు. ఇక అలసిపోయిన సరోజాదేవి కాళ్లకు వాళ్లనాన్న మసాజ్ చేసేవారు. ఆయన తన కూతురు యాక్టర్ అయినందుకు చాలా హ్యాపీగా, ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవారు. హౌజ్ వైఫ్ అయిన సరోజాదేవి మదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఆమెకు కంపల్సరీ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలంటూ మదర్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారుకూడా. అందుకే నో స్లీవ్లెస్ బ్లౌజెస్, నో స్విమ్ సూట్స్ అనేది సరోజా మదర్ రూల్ గా ఉండేది. సరోజా కూడా వీటిని తన కెరీర్ లో తూచ పాటించటం గ్రేట్.

కృష్ణకుమారి డబ్బింగ్

13 ఏళ్ల వయసులో ఓసారి స్టేజ్ పైన పాట పాడుతున్న ఆమెను డైరెక్టర్ క్రిష్ణమూర్తి చూశారు. వెంటనే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె ఈ ఆఫర్ ను వద్దనుకున్నారు. అయితే తెలుగు సినిమాల విషయానికి వచ్చేసరికి ఆమె ఫస్ట్ ఫిలిం ‘పాండురంగ మహత్యం’కు క్రిష్ణ కుమారి.. డబ్బింగ్ ఇచ్చారు. అంటే బీ సరోజాదేవికి డబ్బింగ్ చెప్పింది అప్పటి మరో టాప్ హీరోయిన్ కృష్ణ కుమారి.. ఎంత ఇంట్రెస్టింగ్ విషయం. ఇప్పట్లో ఎవరైనా ఇలా చెప్పగలరా.

చతుర్భాషా తార

‘చతుర్భాషా తార’ అంటూ కన్నడ వాళ్లు ఈమెను ప్రేమగా పిలుస్తారు ఇప్పటికీ. అంటే నాలుగు భాషల్లో అగ్రతార అని అర్థం. ఆమె సినిమా రిలీజ్ అయితే చాలు మగవాళ్లకు పోటీగా ఆడవారు కూడా థియేటర్ కు పరుగులు పెట్టేవారు. ఎందుకంటే అంతపెద్ద ఫ్యాషన్ ఫియస్తాగా ఆమె ఉండేవారు. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. బీ సరోజాదేవి సినిమాల్లో వేసిన బ్లౌజులు, ఆర్నమెంట్స్, హెయిర్ స్టైల్స్ అన్నీ క్రేజీ ఫ్యాషన్స్ గా మార్కెట్లో సేల్ అయ్యేవి. గర్ల్స్, లేడీస్ ఆమెను స్టైలిష్ దివాగా అప్పట్లో ఆరాధించేవారు. అందుకే 60ల్లో ఆమె ఫ్యాషన్ ఐకన్ ఆఫ్ సౌత్ ఇండియన్ వుమెన్ గా పాపులర్ అయ్యారు. హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా, గ్లామ్ డాల్ గా వెలిగారు.

పెళ్లయ్యాక కూడా..

టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఆమె పనిచేశారు. రెండుసార్లు నేషనల్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీలో పనిచేశారు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. కర్నాటక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఛైర్ పర్సన్ గా పనిచేశారు. హీరోయిన్స్ అనగానే మ్యారేజ్ తరువాత యాక్టింగ్ స్టాప్ చేస్తారనేది చాలా కామన్. కానీ ఆమె మాత్రం వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా లీడ్ రోల్ ప్లే చేసింది ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్. ఇదెలా సాధ్యమైందంటే అంతా తన భర్త సపోర్ట్ తోనే అని చెబుతారు సరోజా. పద్మశ్రీ అవార్డ్ కూడా అందుకున్న ఈమె లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అందుకుని ఇప్పటికీ అడపాదడపా యాక్ట్ చేసి అలరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News