Saturday, April 12, 2025
Homeనేషనల్Revanth Reddy speech @ Nagpur: తన స్పీచ్ తో సీనియర్లను ఫిదా చేసిన...

Revanth Reddy speech @ Nagpur: తన స్పీచ్ తో సీనియర్లను ఫిదా చేసిన రేవంత్

భాషాపరంగా తడబడినా రేవంత్ స్పీచ్ లో ఫైర్ ఉందంటున్న జాతీయ నేతలు

పట్టుమని 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆయన స్పీచ్ మాత్రం అదిరిపోయిందంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కితాబు ఇచ్చారు. నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ సభలో స్పాంటేనియస్ గా మాట్లాడిన రేవంత్ తనదైన శైలిలో పంచులు విసురుతూ శ్రేణుల్లో నయా జోష్ నింపారు. సింపుల్ గా మాట్లాడినా, హిందీ-ఉర్దూ కలిపి మాట్లాడటంలో కాస్త తడబడినా రేవంత్ ప్రసంగం మాత్రం శెభాష్ అనిపించుకోవటం హైలైట్.

- Advertisement -

ఏకంగా లాల్ కిలాపై కాంగ్రెస్ జెండా, మోడీ ఛప్పన్ ఇంచ్ ఛాతీ, మోడీ ఎక్స్పైరీ అయిన మెడిసిన్ అంటూ రేవంత్ దంచేశారని కాంగ్రెస్ సీనియర్లు ఫుల్ ఫిదా అయ్యేలా రేవంత్ ప్రసంగం సాగటం మరో హైలైట్. జస్ట్ ఓ వంద రోజులు కష్టపడమని ఆయన చేసిన అప్పీల్ కూడా అందరినీ ఆకట్టుకుంది.

అదానీ-ప్రధాని అంటూ డబుల్ ఇంజిన్ సర్కారుకు కొత్త నిర్వచనం ఇచ్చిన రేవంత్ పంచులు సూపర్ గా పేలాయి. మొత్తానికి నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ సభలో రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షనే కాదు స్పెషల్ అట్రాక్షన్ గా సభా వేదికపై కనిపించి, తన వాణిని వినిపించటంతో కాంగ్రెస్ కు సౌత్ ఇండియాలో కొత్త గొంతుక వచ్చినట్టైందని అప్పుడే కాంప్లిమెంట్లు వచ్చిపడుతున్నాయి. మొత్తానికి మాస్ కు అర్థయ్యేలా ప్రసంగించటంలో కాంగ్రెస్ పార్టీకి మరో మంచి గొంతుక వచ్చినట్టైంది. ఎంతైనా అనర్ఘళంగా మాట్లాడగలిగిన దిట్టగా పేరుగాంచిన బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత అయిన స్వర్గీయ జైపాల్ రెడ్డి సమీప బంధువుగా ఆయన నుంచి కొంత వాగ్ధాటిని రేవంత్ అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News