Friday, November 22, 2024
HomeతెలంగాణVarma on Barrelakka: బర్రెలక్క నేటి గాంధీ: RGV

Varma on Barrelakka: బర్రెలక్క నేటి గాంధీ: RGV

RGV Vs బర్రెలక్క

బర్రెలక్కపై మరోమారు రాం గోపాల్ వర్మ విచిత్రమైన కామెంట్ చేశారు. బర్రెలక్క అభినవ గాంధీ, నేటి మహాత్మా గాంధీ అంటూ ఆకాశానికి ఎత్తేలా వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు లేటెస్ట్ వైరల్ టాపిక్ గా మారింది. అంతకు ముందు పరిస్థితి చూస్తే బర్రెలక్క వర్సెస్ వర్మలా వ్యవహారం కాస్త ముదిరి పాకాన పడటంతో వర్మ తన రూట్ మార్చినట్టు స్పష్టమవుతోంది. ఎందుకంటే వర్మపై లీగల్ యాక్షన్ తీసుకోవటంలో శిరీష బిజీగా ఉన్నారు.

- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క సీరియస్ అయింది. ఆమె అసలు పేరు శిరీష. బర్రెలక్క పేరుతో ఫేమస్ అయ్యారు. ఆమె ఇటీవల కొల్లాపూర్ ఎన్నికల్లో పోటీ చేశారు. పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి ఆమెను పేరును ఉపయోగించుకుంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్కపై చేసిన కామెంట్లు.. వివాదాస్పదమయ్యాయి. తరపున లాయర్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో కేసు నమోదు చేశారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది, బర్రె లెక్క కాస్త ఉంటుంది, బర్రెలు లక్క ఆమె మాట కూడా వింటున్నారు, అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని పేర్కొన్నట్టు సదరు లాయర్ ఉమెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు అని లాయర్ మండిపడ్డారు. ఈ విషయం మీద మరింత పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి మాటలు వద్దు ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతాం అని ఆయన హెచ్చరించారు. బర్రెలక్క అనే పేరుతో ఫేమస్ అయిన తెలంగాణ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన కర్నె శిరీష మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News