Saturday, November 23, 2024
HomeతెలంగాణGarla: జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ సేవలు అభినందనీయం

Garla: జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ సేవలు అభినందనీయం

విద్యాలో రాణించాలంటూ పిలుపు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్దికి జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ సేవలు అభినందనీయమని గార్ల సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ జీనత్ కుమార్ అన్నారు. జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ వ్యవస్థాపకులు గండి సీతారాం గీత దంపతుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆదివారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థులకు రైటింగ్ పాడ్స్ నోట్ బుక్ పెన్నుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ జీనత్ కుమార్ విచ్చేసి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ నోట్ బుక్స్ పెన్నులను పంపిణీ చేశారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాస్త్రవేత్తలుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలన్నారు ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్తు ఉజ్వలమవుతుందన్నారు దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత నోట్ బుక్స్ పెన్నుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారినిజస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ నిర్వాహకులు గండి సీతారాం గీత దంపతులు
శాలువాతో ఘనంగా సన్మానించి కేకును కట్ చేసి పాఠశాల విద్యార్థులకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ ఉషరాణి పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మాలోత్ వెంకట్ లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా వెంకట్ రెడ్డి జవ్వాజి శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ మహబూబాద్ హెడ్ క్వార్టర్ ఎస్సై భానోత్ వెంకన్న శ్రీరామ్ నాయక్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News