Saturday, November 23, 2024
Homeహెల్త్Radish benefits: ఈ సీజన్లో ముల్లంగి తినాల్సిందే

Radish benefits: ఈ సీజన్లో ముల్లంగి తినాల్సిందే

ముల్లింగి ఆకులు చాలా మంచిది

ముల్లంగి చేసే మేలెంతో…

- Advertisement -

చలికాలం అనగానే గుర్తుకువచ్చే కాయగూర ముల్లంగి…. ఆ తర్వాత ముల్లంగినంటిపెట్టుకుని ఉండే ఆకులు. చాలామంది ముల్లంగిని ఆస్వాదించినట్టు దాని ఆకులను తినరు. నిజానికి చలికాలంలో ముల్లంగి ఆకులు అందించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ముల్లంగి ఆకులను పోషకాల బంగారుగనిగా ఆరోగ్యనిపుణులు తరచూ అంటుంటారు. ఈ ఆకుల్లో విటమిన్ కె, విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే సూపర్ హీరో ముల్లంగి ఆకులు. ఈ ఆకుల్లో పీచుపదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా పనిచేస్తుందని పోషకాహారనిపుణులు చెపుతున్నారు. అంతేకాదు మలబద్దకం, అజీర్తి సమస్యలను ఇవి తగ్గిస్తాయి.

చలికాలంలో మనల్ని వేధించే ఎన్నో అనారోగ్యసమస్యలకు ముల్లంగి ఆకులు చెక్ పెడతాయి కూడా. ఈ ఆకుల్లో ఐరన్ తో పాటు ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనల్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. రక్తపోటు తక్కువగా ఉన్నవారికి ముల్లంగి ఆకులు చేసే మంచి ఎంతోనంటున్నారు వైద్యులు. ఈ ఆకుల్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. ముల్లంగి ఆకులతో చేసిన సొల్యూషన్ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహులకు ముల్లంగి ఆకులు చేసే మేలు ఎంతో. ముల్లంగితో పాటు ముల్లంగి ఆకులు కూడా బ్లడ్ షుగర్ ప్రమాణాలను శక్తివంతంగా నియంత్రిస్తాయి.

రక్తహీనతతో బాధపడేవారికి ముల్లంగి ఆకులు చేసే మేలు ఎంతో. ముందే చెప్పినట్టు ముల్లంగి ఆకుల్లో ఐరన్ ఎక్కువ. అందుకే ఈ ఆకులు రక్తహీనతతో బాధపడేవారిలో హిమోగ్లోబిన్ ప్రమాణాలను పెంచుతాయి. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ముల్లంగి ఆకులతో చేసుకునే వంటకాలు ముఖ్యంగా చలికాలంలో మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఎన్నో అందరికీ బాగా అర్థమై ఉంటుంది. చలికాలంలో ముల్లంగి ఆకులతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. ఉదాహరణకు ముల్లంగి ఆకులను సన్నగా తరిగి అందులో టొమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఉప్పు, మసాలాలు కలిపి స్టవ్ మీద ఉడికించాలి. రోటీని ఈ కూరతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ముల్లంగి ఆకులను కలిపి చేసే మరో కూర కూడా ఉంది.

బంగాళాదుంపలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉల్లిపాయలు, టొమాటోలు, మసాలా దినుసులు వేసి వండాలి. చివరిగా అందులో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి వేయాలి. అప్పుడు ఆ కర్రీ రుచి వేరే రేంజ్ లో ఉంటుంది. శెనగపిండి, గోధుమపిండి మిశ్రమంలో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి కలిపాలి. ఆ తర్వాత అందులో మసాలాలు, ఉప్పు వేసి ఆ పిండిని మెత్తగా చేయాలి. ఆ పిండిని చిన్న ఉండలుగా చుట్టి పరాటాలు లేదా రోటీలు చేయాలి. ముల్లంగి ఆకుల రుచితో ఈ పరాటాలు లేదా రోటీలు తినడానికి ఎంతో బాగుంటాయి. మరి ఈ చలికాలంలో ముల్లంగి రెసిపీలతో ఎంజాయ్ చేయండి. మరింత ఆరోగ్యంగా ఉండండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News