Saturday, April 12, 2025
Homeహెల్త్Eye lashes: కనురెప్పలు పెద్దగా..

Eye lashes: కనురెప్పలు పెద్దగా..

ఆలివ్, ఆముదం, ఆల్మండ్ ఆయిల్ తో..

కనురెప్పలు కనువిందుగా…

- Advertisement -

కంటి కనురెప్పలు పెద్దవిగా ఉంటే ఆ కళ్ల అందం రెట్టింపు అవుతుంది. కళ్లు ఎంతో విశాలంగా, చూపరులను ఆకట్టుకునేలా కనిపిస్తాయి. కంటి కనురెప్పలు అలా పెద్దవిగా కనిపించడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి.

ఉదాహరణకు ఆలివ్ ఆయిల్, ఆముదం నూనె రెండింటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కనురెప్పలపై అప్లై చేస్తే అవి పొడుగ్గా పెరుగుతాయి. రాత్రి పడుకోబోయే ముందు పెట్రోలియం జెల్లీని
కనురెప్పలపై అప్లై చేసి రాత్రంతా దాన్ని అలాగే ఉంచుకుంటే కూడా కనురెప్పలు పొడుగ్గా, అందంగా పెరుగుతాయి. ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే మీ కనురెప్పలు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారవుతాయని బ్యూటీ నిపుణులు సైతం చెప్తున్నారు. అలాగే వేడి నీళ్లల్లో గ్రీన్ టీని కలిపి ఆ మిశ్రమాన్ని కనురెప్పలపై అప్లై చేసినా కూడా కనురెప్పలు పెద్దవిగా పెరుగుతాయి. పైగా గ్రీన్ టీ కళ్లకు చల్లదనాన్ని పంచి ఎంతో సాంత్వనను కూడా ఇస్తుంది.

ఆలివ్ ఆయిల్ ను కనురెప్పలకు అప్లై చేయడం వల్ల కూడా కనురెప్పలు చిక్కగా, పొడుగ్గా పెరుగుతాయి. దీంతో మీ ముఖం చందమామలా మెరిసిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News