వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు తీసుకునే డైట్ కు అంజీర్ నీళ్లను జోడించి చూడండి. బరువులో ఎంత గొప్ప మార్పువస్తుందో మీకే తెలుస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. బరువు తగ్గించడంలో అంజీర్ నీళ్లు బాగా పనిచేస్తాయని వీళ్లు చెపుతున్నారు. వెయిట్ లాస్ డైట్ లో అంజీర్ ను తప్పనిసరిగా చేర్చాలంటున్నారు.
- Advertisement -
అజీర్ లో ఫైబర్ బాగా ఉంటుంది. దీంతో కడుపు నిండుగా ఉండి ఆకలి తొందరగా వేయదు. ఫలితంగా చిరుతిళ్ల మీద మనసు పోదు. జీర్ణవ్యవస్థను కూడా అంజీర్లు ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫలితంగా వెయిట్ మేనేజ్మెంట్ బాగా అవుతుంది. అందుకే నిత్యం తీసుకునే డైట్ లో అంజీర్ ను తప్పనిసరిగా చేర్చాలని ఊబకాయనిపుణులు కూడా చెపుతున్నారు.
అంజీర్ నీళ్లు ఇలా..
- రాత్రి మూడు లేదా నాలుగు అంజీర్లను నీళ్లల్లో నానబెట్టాలి. మర్నాడు ఉదయం అందులోని అంజీర్లను తీసేసి ఆ నీటిని తాగాలి. మీకు నచ్చితే ఆ నీళ్లల్లో తేనె కొద్దిగా వేసుకుని తాగొచ్చు. ఈ నీళ్లను ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. లేదా భోజనానికి ముందు తాగాలి.