Saturday, October 5, 2024
HomeతెలంగాణKarimnagar: కరీంనగర్ జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Karimnagar: కరీంనగర్ జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

యధావిధిగానే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలు

కరీంనగర్ లో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం అందజేసిన ఇళ్ళ స్థలాలు రద్దు అనే అసత్య ప్రచారాలు నమ్మవద్దని టీయుడబ్ల్యుజే (H-143) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బోనాల మల్లికార్జున్ తెలిపారు. టీయుడబ్ల్యుజే ఆధ్వర్యంలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జర్నలిస్టుల చిరకాల వాంఛ అయినటువంటి సొంత ఇంటి స్థలం కోరిక ఇటీవల నెరవేరగా కొందరు జర్నలిస్టు సంఘాల నేతలు జర్నలిస్టుల సంక్షేమాన్ని జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడాలి తప్ప వారి స్వార్థ రాజకీయాల కోసం జర్నలిస్టులను ఆందోళనలకు గురి చేయవద్దని హెచ్చరించారు. నివేషన స్థలాలు అందని అర్హులైన జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం ఇళ్ళ స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల విషయంపై జిల్లా కలెక్టర్, స్థానిక ఆర్డీవోను కలిసి చర్చించామని అధికారులు సానుకూలంగా స్పందించారని…అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం జరిగితే టీయుడబ్ల్యుజే ఆధ్వర్యంలో ఆందోళనలకు కూడా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు చెరుకు గోపాల కృష్ణ, అలిమొద్దిన్, పడాల రవి కుమార్, తోట శ్రీకాంత్ వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎండీ అజీమ్, ఎండీ సలీం, టౌన్ రిపోర్టర్స్ అధ్యక్ష కార్యదర్శులు సదానందం, జన్నారం శ్రీనివాస్, రఘు ,సుధాకర్, అనిల్, వీడియో జర్నలిస్టులు సంపత్, రవి కుమార్ , నయీం, నర్సింగం, సుమంత్, కిషోర్, వినయ్, ఫోటో జర్నలిస్టు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News