అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత నాయకులు నుంచి కార్యకర్తల నుంచి అనేక అభిప్రాయాలు వచ్చాయన్నారు కేటీఆర్. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సమావేశంలో అభిప్రాయాలను కార్యకర్తలు వ్యక్తపరిచారు. గ్రామాల్లో ప్రజలు KCR ముఖ్యమంత్రిగా దిగిపోతారని ఓడిపోతారని కలలో కూడా అనుకోలేదని చర్చించుకుంటున్నారని కేటీఆర్ గుర్తుచేస్తూ ప్రసంగించారు. ఎమ్మెల్యేను వద్దనుకున్నం గానీ టిఆర్ఎస్ ప్రభుత్వం పోతుందనుకోలేదని చర్చించుకుంటున్నారని మన నాయకులు చెప్పారని కేటీఆర్ చెప్పటం హైలైట్.
గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు కొన్ని సవరణలు చేస్తే బాగుండేది అనే సూచనలు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందిస్తున్న పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్పిన సూచనలను ఫీడ్బ్యాక్ ను కేవలం పార్టీ అభిప్రాయంగా కాకుండా ప్రజల అభిప్రాయంగా భావిస్తున్నామన్నారు. పది సంవత్సరాలు తెలంగాణలో జరిగిన అభివృద్ధి పైన గానీ తాగునీరు విద్యుత్తు సాగునీరు అంటే అంశాల పైన ఇలాంటి ఫిర్యాదులు తెలిపారు. కానీ కొన్ని విషయాల వలన స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వము మీద పార్టీ పైన జరిగిన దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేదని చెప్పారు. పార్టీని మరింత బలంగా చేసుకుంటే బాగుంటుందని సూచించారు. ఇంటికో ఒక ఉద్యోగము ..ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ వంటి అంశాలలో జరిగిన దుష్ప్రచారాన్ని ఖండించడంలో మన పార్టీ విఫలమైందని అభిప్రాయపడ్డారు.
పార్టీ పరంగా చేసుకోవాల్సిన మార్పు చేర్పులను చర్చించుకున్నాంమన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు పార్టీ తరఫున వేసిన కాంగ్రెస్ 420 హామీల బుక్లెట్ ని అందించినం. పార్లమెంటు వారిగా తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశాలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత అసెంబ్లీల వారీగా సన్నాహాక సమావేశాలు జరుగుతాయని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయాలకు ఆగడాలకు పాటుపడుతుందన్నారు. తుంగతుర్తి లాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు. వీటిని ప్రజాస్వామికంగా ఎదుర్కొంటామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు భారత రాష్ట్ర సమితి ఎంపీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి శ్రీరామరక్ష భారత రాష్ట్ర సమితినే అని విశ్వాసం వ్యక్తంచేశారు. దానికి కారణం గత పది సంవత్సరాల్లో పార్లమెంటులో తెలంగాణ మాట వినిపించిందంటే దానికి కారణం భారత రాష్ట్ర సమితి అన్నారు.