Tuesday, September 17, 2024
HomeతెలంగాణNagarkurnool: గవ్వమఠం విశ్వనాథ శాస్త్రికి 'పురోహిత భాస్కర' పురస్కారం

Nagarkurnool: గవ్వమఠం విశ్వనాథ శాస్త్రికి ‘పురోహిత భాస్కర’ పురస్కారం

నాగర్ కర్నూలు జిల్లా నందివడ్డేమాన్ శ్రీ నందీశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథ్ శాస్త్రికి ‘పురోహిత భాస్కర’ పురస్కారం ప్రదానం చేశారు. గత 30సంవత్సరాలుగా సమాజంలో పౌరోహితం-అర్చకత్వం నిర్వహిస్తూ శ్రీశైలం, కాశీల్లో జరిగే సనాతన హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని విశేష సేవలందిస్తున్నారు విశ్వనాథ శాస్త్రి. డా.గవ్వమఠం విశ్వనాథ్ శాస్త్రి సేవలను గుర్తిస్తూ శ్రీశైల జగద్గురు పండితారాధ్య మహాపీఠం తరుపున శ్రీశైల సూర్యసింహాసనాధీశ్వర శ్రీశ్రీశ్రీ డా. చన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య స్వామిజీ (పీఠాధిపతి) గారి ద్వాదశ వార్షిక పీఠారోహణం, జన్మ సువర్ణమహోత్సవ సందర్భంలో వారి అమృతహస్తముల ద్వారా “పురోహిత భాస్కర” అను ప్రస్కార బిరుదుతో సత్కరించి ఆశీర్వదించారు.

- Advertisement -

డాక్టర్ గవ్వమటం విశ్వనాథ శాస్త్రి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలుగు, కర్ణాటక, హిందీ భాషలలో సాంప్రదాయ రీతిలో పూజా సంస్కారాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. అర్చక స్వాముల పరీక్షల్లోనూ పర్యవేక్షకులుగా ఆయన వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా డాక్టరేట్, పలు అవార్డులు ఈయన అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News