పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉన్నదని పండుగ వైభవం చాలా గొప్పవైనదని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఆకర్షణీయంగా పల్లె వాతావరణం కళ్లకు కట్టేవిధంగా చాలా చక్కగా ఏర్పాటు చేసిన “అల్ఫోర్స్ ముందస్తు మకర సంక్రాంతి మహోత్సవం”నకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాగణపతి, శ్రీ గౌరీమాత విగ్రహానికి’ జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి పూజా కైంకర్యాన్ని నిర్వహించి వేడుకలను శాస్త్రోంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పల్లెలో చాలా గొప్పగా సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని వైభవోపేతంగా ఆకాశమే హద్దుగా అన్నట్టుగా సోదరభావంతో ప్రేమ ఆప్యాయతలతో చాలా ఉత్సాహంగా జరుపుకుంటారని చెప్పారు. విదేశాలలో సైతం ఈ పండుగకు చాలా ప్రాచూర్యం ఉన్నదని, మన దేశంలో అవలంభించే పండుగ విధివిదానాలను ఎటువంటి లోటులేకుండా అమలు పర్చి పండుగ వైభవాన్ని ఘనంగా నిర్వర్తిస్తారని చెప్పారు. మకర సంక్రాంతి కంటేముందు , తర్వాత వచ్చే రోజులుగా పరిగణించబడు భోగి , కనుమ ప్రత్యేకత చాలా ఉన్నదని ఈ పండుగలే సంక్రాంతి పండుగను పరిపూర్ణంగా చేస్తుందని అన్నారు. సమాజంలో నెలకొన్న దుష్టశక్తులను ప్రారద్రోలడానికై భోగభాగ్యాలు సిద్దించడానికై భోగి పండుగ రోజున ప్రత్యేక పూజలు చేస్తామని భోగి మంటలతో చెడును ప్రారదోలి మంచిని ఆహ్వానిస్తు జీవితం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారని అన్నారు.
కనుమ పండుగ రోజు ఆడపడచులు ఒకరిఒకరు నోములను పంచుకొని పసుపు బొట్టు తీసుకొని వాయినాలను ఇచ్చిపుచ్చుకోవడం సంస్కృతి సాంప్రదాయానికి ఒక గొప్ప నిదర్శనమని గుర్తు చేస్తూ ఈ పండుగ ద్వారా మహిళలకు అష్టఐశ్వర్యాలతో పాటు ఆయూరారోగ్యాలు సిద్దిస్తాయని అన్నారు. ఈ పండుగను ప్రతి ఒకరు చాలా భక్తిశ్రద్దలతో నిర్వహించుకొని విశిష్టతను వ్యాపింపచేస్తారని తెలిపారు.
వేడుకలలో భాగంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొత్తకొండ జాతర, మకర జ్యోతి దర్శనం, బొమ్మలు, పిండివంటలు, శ్రీగోదాదేవి కళ్యాణం, రైతు, పంట పోలాలు, సోదిచెప్పడం, పిట్టలదొర విన్యాసాలు, బొమ్మల కొలువు, బసవన్న చేష్టలు, కోడిపందెం చాలా అలరించాయి. ప్రత్యేకంగా విద్యార్థులు ప్రదర్శించిన ” సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సంక్రాంతి గొప్పదనం తెలుసుకోవే తుమ్మెద” పలు నృత్యాలు ఆలోచింపచేశాయి.
ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది విద్యార్థులు వివిధ ఆకర్షణీయ, సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేసారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు , విద్యార్థులు పాల్గొన్నారు.