Friday, November 22, 2024
HomeదైవంKomuravelli: కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

Komuravelli: కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

అమ్మవార్లకు బంగారు కిరీటాలను చేపిస్తానన్న మంత్రి

అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతాలు, వీరశైవ అర్చకుల వేదమంత్రాలు, భక్తకోటీ జయజయద్వానాల మధ్య వెండి సింహాసనదరియై కొమురవెల్లి మల్లన్న బలిజ మేడలమ్మ గోళ్లకేతమ్మలను వివాహమాడారు. మల్లన్న కళ్యాణం తోట బావి వద్ద కళ్యాణ మండపం వేదికైంది. కొండసొరికాల్లో కొలువైన కోరమిసాల మల్లన్న కళ్యాణం సనాతన వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరి బాలాజీ, వీరశైవ పీఠాధిపతి శ్రీమత్ జగద్గురువు1008 సిద్దిలింగరాజ దేశీకేంద్రశివాచర్య మహాస్వామి ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న కళ్యాణం అంగరంగ వైభోగంగా నిర్వహించారు.

- Advertisement -

అర్చకులు మల్లికార్జునస్వామి, మెడలమ్మ, కేతమ్మల ఉత్సవ విగ్రహాలను సంప్రదాయం బద్దంగా పల్లకిలో దేవాలయ ఆవరణలో ఊరేగింపుగా, మహిళల కోలాటాల,మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మండపనికి తీసుకువచ్చారు. వరుడు మల్లికార్జునస్వామి తరుపున కన్యాగ్రహితలుగా పడిగన్నగారి వంశస్థులు, మెడలమ్మ, కేతమ్మ అమ్మవార్ల తరుపున కన్యాదాతలుగా మహాదేవుని వంశస్థులు తంతు నిర్వహించారు. అనంతరం దేవతమూర్తులను పట్టువస్త్రాలు, పూలమాలలు ధరింపచేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు.

స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి కళ్యాణ మండపనికి తీసుకొనివచ్చి సంప్రదాయ బద్దంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేశారు. ముక్కోటి దేవతలు, పంచభూతాలు, వీరశైవ అర్చకుల వేద మంత్రాల మధ్య మల్లికార్జునస్వామి బలిజమేడలమ్మ, గోళ్లకేతమ్మలను వివాహమాడగా కళ్యాణ మండపం వద్ద భక్తుల జయజయద్వానాల మధ్య మల్లన్న నామస్మరణతో కళ్యాణ వేదిక మారుమ్రోగింది. ప్రభుత్వం తరఫున మేడలమ్మ కేతమ్మ అమ్మవార్లకు బంగారు కిరీటాలను తయారు చేపిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.


మల్లన్న కళ్యాణనికి సుమారు 50వేల మంది హాజరైనట్టు అలయాధికారుల అంచనా, డీసీపీ ఆడ్మిన్ అందే శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పోలీసుశాఖ వారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు చెప్పట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News