Saturday, November 23, 2024
Homeహెల్త్Beautiful foot: ఫుట్ కేర్ లేకపోతే కాళ్లు గలీజుగా..

Beautiful foot: ఫుట్ కేర్ లేకపోతే కాళ్లు గలీజుగా..

కాళ్లకు గోర్లు పెంచితే షేప్ చేసి, పాలిష్ వేయాల్సిందే

సున్నితమైన పాదాలకు…

- Advertisement -

పాదాలు అందంగా, మ్రుదువుగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేమిటంటే..
 గోరువెచ్చటి నీటిలో పాదాలను కొద్దిసేపు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై చేరిన మ్రతకణాలుపోతాయి.
 నిత్యం పాదాలను శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం రఫ్ గా ఉండకుండా సున్నితంగా తయారవుతుంది.
 గోరువెచ్చటి నీళ్లల్లో కొద్దిగా నూనె వేసి పాదాలను పదిహేను నిమిషాలు ఉంచితే పొడిచర్మం పోయి పాదాలు మ్రుదువుగా తయారవుతాయి.
 సాయంత్రాలు పాదాలకు మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా పట్టించాలి. రాత్రిపూట కాటన్ సాక్స్ వేసుకుని నిద్రపోవాలి.
 లిక్విడ్ సోప్ లేదా జెల్ తో పాదాలను కడుక్కుంటే అవి నాజూకుగా కనిపిస్తాయి.

 కాలివేళ్లకు ఉన్న గోళ్లను తీసేసి శుభ్రంగా ఉంచుకోవాలి. కాలిగోళ్లను పెంచుకుంటే వాటికి తప్పనిసరిగా నెయిల్ పాలిష్ వేసుకోవాలి.
 మడమలను స్క్రబ్బర్ తో రుద్దుకోవాలి. కాలివేళ్ల మధ్య కూడా స్క్రబ్బర్ తో శుభ్రం చేసుకోవడం మరవొద్దు.
 గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. అలాకాకుండా బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారి రఫ్ గా తయారవుతుంది.
 స్నానం చేసిన తర్వాత మర్చిపోకుండా పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
 చాలామందికి పాదాల అంచులు పగులుతుంటాయి. పగుళ్ల వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. పగుళ్లు పోవడానికి క్యాండిల్ వాక్స్ ను కరగబెట్టి అంతే మొత్తంలో ఆవనూనెను అందులో కలిపి పేస్టులా చేసి దాన్ని పాదాల అంచులకు రాసుకుంటే అవి మ్రుదువుగా తయారవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News