Friday, September 20, 2024
Homeపాలిటిక్స్CM Revanth: అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదు

CM Revanth: అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదు

నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు

MCRHRD లో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమావేశం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలంటూ ఈ భేటీలో సీఎం రేవంత్ అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామన్న సీఎం, నియోజకవర్గాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని తెగేసి చెప్పిన ముఖ్యమంత్రి, అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని దిశానిర్దేశం చేసి, ప్రతీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలెప్ మెంట్ నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నట్టు, ఇంచార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుని, సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

పార్టీ , ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలన్న రేవంత్, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని 5 జిల్లాల నేతలకు గట్టిగా చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News