Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Chandrababu in Allagadda: స్వర్ణ యుగం రావాలంటే టిడిపితో నడవండి

Chandrababu in Allagadda: స్వర్ణ యుగం రావాలంటే టిడిపితో నడవండి

నంద్యాల జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు మావే

రా కదలిరా.. తెలుగుదేశం పిలుస్తోంది అని పిలుపు ఇవ్వగానే నంద్యాల పార్లమెంట్ నడుం బిగించిందని… ఆళ్లగడ్డ అదరగొట్టిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా ఘాట్ సమీపంలో సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తనకు మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయని.. రాష్ట్రంలో మళ్లీ తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పేర్కొన్నారు.
నంద్యాల జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు బావుటా ఎగురవేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన వివరించారు. ఈరోజు ఆళ్లగడ్డ వాసులకు జాతీయ రహదారిని తమ ప్రభుత్వం హయాంలోనే మంజూరు చేయించి పూర్తి చేయగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. తమ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని ఆయన పేర్కొన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టును తెచ్చి రాయలసీమకు సాగునీరు అందించిన ఘనత నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దే నన్నారు. ఆయన ఒక యుగపురుషుడని కొనియాడారు. కర్నూలు సమీపంలోనీ ఓర్వకల్లు జాతీయ విమానాశ్రయాన్ని తీసుకువచ్చిన ఘనత కూడా తమదేనన్నారు. ముచ్చుమర్రి పులకుర్తి ఓర్వకల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పూర్తి చేస్తామని, తమ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంగన్వాడీలను ఆదుకుంటామని ఈ ప్రభుత్వం వారిపై ఏస్మా చట్టాలను ప్రయోగించడం సిగ్గు చేటు అయిన విషయమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

చంద్రబాబు వరాల జల్లు
రాష్ట్రంలో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే అభివృద్ధిని పనులను గురించి ఆయన వివరించారు. సిద్దాపురం, మిడుతూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తామని, బనగానపల్లె కోయిలకుంట్ల బైపాస్ రోడ్డు పనులను పూర్తి చేస్తామని, జోలదరాసి రిజర్వాయర్ని పూర్తి చేస్తామని, కర్నూలు ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేస్తామని, కర్నూలుకు హైకోర్టు బెంచి తీసుకొని వస్తామని, హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేస్తామని, గాలేరు నగరి, ఆర్టీ. ఎస్ కుడి కాలువ ,హెచ్ ఎల్ సి ఆధునికరణ, వుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను తీసుకొని వస్తామని, నిరుద్యోగ సమస్య నివారణకు మెగా డీఎస్సీ తో పాటు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలంటే భర్తీ చేస్తామని ప్రజల హర్షద్వానాల మధ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జిల్లాలోనిఎమ్మెల్యేలు ప్రజాసేవను మరిచి అధికార దాహంతో వ్యవహరిస్తున్నారన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజీబిజీ అని ఆయన పేరే బిజేంద్రారెడ్డి అని అన్నం తినడం మానేసి ఇసుక ఎర్ర మట్టి అక్రమ బియ్యంతో బిజీగా ఉన్నారన్నారు నంద్యాలఎమ్మెల్యే సండే ఎమ్మెల్యేగా ఉన్నారని పాణ్యం ఎమ్మెల్యే జగన్నాథ గుట్టనే మింగేసారని డోన్ ఎమ్మెల్యే మంత్రి పిట్టకథల మంత్రిగా పేరు సంపాదించారని అలాగే శ్రీశైలం బనగానపల్లి నందికొట్కూర్ ఎంత అవినీతి చేసిన వీరిని మార్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. స్వర్ణ యుగం లాంటి పాలన కావాలంటే టిడిపి అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అంతకుముందు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రసంగించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ మాజీ మంత్రి ఫరూక్ పులివెందల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భూమా విద్యాత రెడ్డి భార్గవరామ్ మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రయ్య బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రభాకర్ చౌదరి ,ఉక్కు ప్రవీణ్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి సోమిశెట్టి వెంకటేశ్వర్లు హైకోర్టు న్యాయవాది నంద్యాల టిడిపి పార్లమెంటు నాయకులు గోగి శెట్టి నరసింహారావు, జనసేన నాయకుడు సురేషు మైలేరి మల్లయ్య, టిడిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News