Saturday, November 23, 2024
HomeతెలంగాణKhammam Congress: రాహుల్ యాత్రకు సంఘీభావంగా ర్యాలీ

Khammam Congress: రాహుల్ యాత్రకు సంఘీభావంగా ర్యాలీ

జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల్లు దుర్గా ప్రసాద్, జావేద్

సరికొత్త భారతాన్ని నిర్మించడమే రాహుల్ గాంధీ లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గ ప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ లు అన్నారు. రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ యాత్రకు సంఘీభావంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం రెడ్డి భవనం నుండి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, దేశ సమగ్రత సమైక్యత కోసం రాహుల్ గాంధీ పరితపిస్తున్నారని అప్రజాస్వామిక పాలనలో మగ్గుతున్న దేశాన్ని కాపాడేందుకు కష్ట పడుతున్నారని తెలిపారు. ఏడాదిన్నర కిందట కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్రను చేశారు. ఈ సమయంలో అ వర్గాల ప్రజలను ఆయన కలుసుకున్నారు. తాజాగా, మళ్లీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్నారని తెలిపారు. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర విజయవంతంగా ముగించాలని జిల్లా కాంగ్రెస్ తరపున కోరుతున్నట్టు తెలిపారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ, పేదలు ఆత్మగౌరవం కోల్పోయారని, నిరుద్యోగంతో యువత కలలు కలగానే మిగిలి పోయాయని మహిళలు తమకు దక్కాల్సిన గౌరవం కోసం తహతహలాడుతున్నారని అన్నారు. అలాగే, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన, పార్లమెంట్లో ఎంపీలు తమ సస్పెన్షన్కు వ్యతిరేకంగా నిరసన తెలిపటం లాంటి సంఘటనలు చాలా జరిగాయన్నారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సమాచార హక్కు, విద్యాహక్కు చట్టాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రతిష్ఠాత్మక చట్టాలకు పాతర వేసి ఎన్డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచి పెడుతోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని, రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశానికి వేసిన సంకెళ్లు తొలగిపోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటి కార్యనిర్వాహక అద్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు , ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా ఐ ఎన్ టి యు సి, మహిళా కాంగ్రెస్, మైనారిటి, సేవాదళ్ అద్యక్షులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, సయ్యద్ గౌస్,కార్పొరేటర్ల మలీదు వేంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, మిక్కిలినేని మంజుల, కమర్తపు మురళి, మిక్కిలినేని నరేందర్,పల్లెబోయిన భారతిచంద్రం, షేక్ నాగుల్ మీరా, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దినేని రమేష్, వడ్డేబోయిన నరసింహరావు, వడ్డేబోయిన శంకర్, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు,రషీద్, జిల్లా ఓ బి సి సెల్ ఉపాధ్యక్షులు గజ్జి సూర్యనారాయణ,వాసిం, ఏలూరి రవికుమార్, కొట్టెముక్కల నాగేశ్వరరావు, రఘునాథపాలెం మండల అద్యక్షులు భూక్యా బాలాజి,నగర ఐ ఎన్ టి యు సి, ఓ బి సి అద్యక్షులు నరాల నరేష్, బాణాల లక్ష్మణ్, నగర కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకటయ్య, కాలంగి కనకరాజు, సంపటం నరసింహరావు, దొన్వాన్ వెంకట్రావు, నుకారాపు వేంకటేశ్వర్లు, షేక్ అబ్దుల్ రెహమాన్,జ్యోతి, దామా స్వరూప, సుగుణ, తవిడబోయిన రవి, ముజాహిద్దిన్,షేక్ జానిమియా, మియాభాయ్, మహమూద్, జెర్రిపోతుల అంజని కుమార్, బోయిన వేణు, సుదర్శన్, ఉన్నం రాజశేఖర్, బీరెడ్డి రమేశ్, రమేష్, పర్వత శ్రీనివాస్, గడ్డికొప్పుల ఆనందరావు, కందుల శ్రీను, కొలిపొంగు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News