తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) టొరంటో లో సంక్రాంతి పండుగ వైభవంగా ఘన వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు తీన్మార్ సంక్రాంతిగా చింగ్కూజీ సెకండరీ స్కూల్, బ్రాంటెన్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 800 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి గారు ప్రారంభించగా, శ్రీమతి మేఘన గుర్రాల, శ్రీమతి శైలజ ఎర్ర, శ్రీమతి స్ఫూర్తి కొప్పు, కుమారి ప్రహళిక మ్యాకల మరియు శ్రీమతి శ్రీరంజని కందూరి గార్లు జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీరామదాసు అర్గుల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.
ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతముగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ మరియు షో అండ్ టెల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రాహుల్ బలనేని మరియు శ్రీమతి జ్యోతి రాచ మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా శ్రీ ప్రవీణ్ నీల గారు, శ్రీమతి ఝాన్సీలక్ష్మి గరిమెళ్ళ గారు, శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి గారు మరియు శ్రీమతి మనస్విని వెలపాటి గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ డాక్టర్ సౌజన్య కాసుల మరియు శ్రీ యేసు బాబు గారిచే 2024 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము తో అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.
తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి మరియు కుమారి ప్రహళిక మ్యాకల నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శ్రీ శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, సంయుక్త కోశాధికారి శ్రీ రాహుల్ బాలనేని మరియు డైరెక్టర్లు శ్రీ నాగేశ్వరరావు దలువాయి, శ్రీ ప్రణీత్ పాలడుగు, శ్రీ భగీరథ దాస్ అర్గుల, శ్రీ ప్రవీణ్ కుమార్ సామల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అతిక్ పాషా వ్యవస్థాపక సభ్యులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీ ప్రకాష్ చిట్యాల, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ హరి రావుల్, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.